తమిళిసై ఓటమి ఖాయమా? గవర్నర్ పదవి వదిలితే ఇదా పరిస్థితి?

తమిళనాడు రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చెన్నై 'మైలాపూర్' అసెంబ్లీ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ అగ్రనేత తమిళిసై సౌందరరాజన్ బరిలో ఉండటంతో అందరి దృష్టి ఇక్కడే ఉంది. అయితే, తాజా రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల మొగ్గు చూస్తుంటే తమిళిసైకి ఇక్కడ గండం పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆమె పరిస్థితి ఏంటి? తెలంగాణ గడ్డ మీద తమిళ పట్టు చూపించిన తమిళి సై.. సొంత రాష్ట్రంలో విజయం సాధించలేరా..? సర్వేలు ఎలా ఉన్నాయి.?

ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు నిలయమైన మైలాపూర్ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తమిళిసై సౌందరరాజన్‌కు సొంత గడ్డపైనే గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సుమారు 1,90,000 మందికి పైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో సామాజిక వర్గాల చీలిక - అంతర్గత విభేదాలు బీజేపీ విజయవకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి.

Mylapore Election Shock Why BJP Candidate Tamilisai Soundararajan Faces a Tough Battle for Survival

బ్రాహ్మణ ఓటు బ్యాంక్ ఎటువైపు?

మైలాపూర్ కోటలో దాదాపు 80 శాతం మంది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఉన్నారు. ఇక్కడ గెలుపోటములను శాసించేది వీరే. ప్రస్తుతం ఈ ఓట్లు బీజేపీకి కాకుండా టీవీకే (తమిళ వెట్రి కళగం) అభ్యర్థి వెంకట రమణన్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆయన అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, స్థానికంగా మంచి పట్టు ఉండటంతో బ్రాహ్మణ ఓటర్లు ఆయనకే జై కొట్టే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇది తమిళిసైకి కోలుకోలేని దెబ్బ కానుంది.

మత్స్యకార ఓట్లను చీల్చనున్న 'అన్నామలై' ఫ్యాన్!

నియోజకవర్గంలో రెండో ప్రధాన వర్గం మత్స్యకారులు. ఇక్కడ విజయకృష్ణ అనే స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉండటం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. విజయకృష్ణకు అటు మత్స్యకార సామాజిక వర్గంలో పట్టు ఉండటంతో పాటు, ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకి వీరాభిమాని కావడం గమనార్హం. ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తుండటంతో అటు మత్స్యకార ఓట్లు, ఇటు అన్నామలై అభిమానుల ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. ఇది పరోక్షంగా బీజేపీ ఓటు బ్యాంకుకు గండి కొడుతోంది.

పొత్తు ధర్మం పాటిస్తారా? అన్నాడీఎంకే మౌనం!

బీజేపీ, అన్నాడీఎంకే పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తమిళిసై అభ్యర్థిత్వాన్ని అన్నాడీఎంకే క్యాడర్ మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదని తెలుస్తోంది. అన్నాడీఎంకే కార్యకర్తలు తమిళిసైకి సహకరించే పరిస్థితి కనిపించకపోవడం, మరోవైపు అన్నామలై అభిమానులు కూడా గుర్రుగా ఉండటంతో గ్రౌండ్ లెవల్‌లో బీజేపీ ప్రచారం నీరసించిపోయింది.

డీఎంకే సిట్టింగ్ బలం.. సర్వేల హెచ్చరిక!

ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, డీఎంకే అభ్యర్థి మైలై థావేలు కూడా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కన పెడితే, విపక్షాల మధ్య ఓట్లు చీలిపోవడం ఆయనకు లాభించేలా ఉంది. పలు ప్రముఖ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మరియు క్షేత్రస్థాయి సర్వేల్లో కూడా తమిళిసై ఓటమి దిశగా సాగుతున్నారని, ఇక్కడ టీవీకే లేదా డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుందని స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి, గవర్నర్ పదవిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసైకి మైలాపూర్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+