Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సిద్దరామయ్య అంతు చూడండి, మాజీ డీసీఎంకు 70 ఎంఎం సినిమా, ఎఫ్ఐఆర్ తో !

బెంగళూరు/మైసూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్క్ రాజకీయాలు మొదలైనాయి. తాము ప్రతీకార రాజకీయాలకు దూరం అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బెంగళూరులోని మల్లేశ్వరం నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే అశ్వథ్ నారాయణ మీద కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. సిద్దరామయ్య అంతు చూడండి అంటూ మూడు నెలల క్రితం నోరుజారిన మాజీ డీసీఎం మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం కలకలం రేపింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీ నాయకులు ఒకరి మీదఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఫిబ్రవరి 15వ తేదీన మండ్య జిల్లాలోని సాతనూరులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అప్పటి కర్ణాటక మంత్రి అశ్వథ్ నారాయణ మాట్లాడారు. టిప్పు సుల్తాన్ ను ఉరిగౌడ, నంజేగౌడ ఎలా అంతం చేశారు అలాగే మీరు సిద్దరామయ్య అంతు చూడాలని బీజేపీ నాయకుడు అశ్వథ్ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Mysuru police registered FIR against BJP MLA who made sensational comments on Siddaramaiah.

మా పార్టీ నాయకుడు సిద్దరామయ్య మీద బీజేపీ నాయకుడు అశ్వథ్ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మా నాయకుడి అంతు చూడాలని ప్రజలను రెచ్చగొడుతున్నారని, అశ్వథ్ నారాయణ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కేపీసీసీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ మైసూరులోని దేవరాజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయితే అప్పట్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పోలీసులు అప్పటి మంత్రి అశ్వథ్ నారాయణ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీజేపీ ఇంటికి వెళ్లిపోవడంతో 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది.

Mysuru police registered FIR against BJP MLA who made sensational comments on Siddaramaiah.

సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావడంతో మూడు నెలల క్రితం జరిగిన సంఘటన మళ్లీ తెరమీదకు వచ్చింది. బుధవారం మళ్లీ మైసూరులోని దేవరాజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కేపీసీసీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ మళ్లీ బీజేపీ ఎమ్మెల్యే అశ్వథ్ నారాయణ మీద మళ్లీ ఫిర్యాదు చేశారు. మైసూరు పోలీసులు బీజేపీ ఎమ్మెల్యే అశ్వథ్ నారాయణ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సిద్దరామయ్య మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన అశ్వథ్ నారాయణను అరెస్టు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దరామయ్య మీద బీజేపీ ఎమ్మెల్యే అశ్వథ్ నారాయణ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అశ్వథ్ నారాయణను అరెస్టు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న ఇప్పటికే ధర్నాలు చేశారు.

ఇప్పటికే ఈ విషయంపై అశ్వథ్ నారాయణ విచారం వ్యక్తం చేశారు. తాను సిద్దరామయ్య గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అశ్వథ్ నారాయణ అన్నారు. ఈ విషయంపై సిద్దరామయ్య కూడా ఇప్పటికే స్పందించారు. ఉన్నత శిక్షణ శాఖా మంత్రిగా ఉన్న అశ్వథ్ నారాయణ తన అంతు చూడాలని బీజేపీ కార్యకర్తలకు చెప్పి వాళ్లను రెచ్చగొట్టారని సిద్దరామయ్య ఆరోపించారు.

అశ్వథ్ నారాయణ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి సీఎం బసవరాజ్ బోమ్మయ్, కర్ణాటక హోమ్ శాఖా మంత్రి మౌనంగా ఉన్నారని, కనీసం అశ్వథ్ నారాయణ వ్యాఖ్యలను ఖండించలేదని, సిద్దరామయ్య మండిపడ్డారు. ఇప్పుడు మూడు నెలల క్రితం జరిగిన సంఘటనపై బీజేపీ ఎమ్మెల్యే అశ్వథ్ నారాయణ మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో హాట్ టాపిక్ అయ్యింది. అయితే బీజేపీ ఎమ్మెల్యే అశ్వథ్ నారాయణ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ? అని అందరూ టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+