వెరీ సెక్సీ, హాట్: మహిళకు అసభ్య మెసేజ్‌లు పంపిన నాబార్డ్ ఉద్యోగి(ఫొటో)

న్యూఢిల్లీ: మరో ఆన్‌లైన్ లైంగిక వేధింపుల కేసు వెలుగుచూసింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్)లో పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి ఓ మహిళకు అసభ్య సందేశాలు పంపించాడు. కాగా, పర్యావరణవేత్త అయిన బాధిత మహిళ తనకు సదరు అధికారి పంపిన అసభ్య సందేశాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకుంది.

అంతేగాక, అధికారి ప్రవర్తనపై బాధితురాలు నాబార్డ్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో జైపూర్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న నిందితుడు జగదీష్ ప్రసాద్ ఆమెకు క్షమాపణలు చెప్పాడు.

NABARD officer sends lewd message to a woman on LinkedIn, faces inquiry

కాగా, నాబార్డ్ అధికారి తన ప్రొఫెసనల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ ద్వారా మొదట రూరల్ డెవలప్‌మెంట్, మహిళా సాధికారతపై ఆ మహిళకున్న అనుభవమేంటని ప్రశ్నించాడు. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత విషయాలపై ప్రశ్నించడం మొదలుపెట్టాడు.

‘నీకు వివాహమైందా? ప్రియుడు ఉన్నాడు? ఏ మతం?' అని ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా నువ్వు సెక్సీగా, హాట్‌గా ఉన్నావంటూ వ్యాఖ్యానించాడు.

దీంతో సదరు మహిళ ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ నాబార్డ్ ఛైర్మన్‌కు లేఖ రాసింది. కాగా, సిఎన్ఎన్-ఐబిఎన్ కథనం ప్రకారం.. నిందిత అధికారిపై అంతర్గత విచారణ చేపడతామని, దోషిగా తేలితే అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని నాబార్డ్ ఛైర్మన్ ఆమెకు హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+