నాగాలాండ్ గవర్నర్ ఆకస్మిక మరణం
నాగాలాండ్ గవర్నర్ గణేషన్ అయ్యర్ (Ganesan Iyer) ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఇంట్లో జారిపడటంతో తలకు తీవ్ర గాయమైంది. ఆప్పటి నుంచి చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
బీజేపీ నేతగా, గవర్నర్‌గా గణేషన్ అయ్యర్ సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆయన మృతిపై దేశంలోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

"గణేషన్ అయ్యర్ దేశ సేవకు, జాతి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన భక్తుడైన జాతీయవాదిగా ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. తమిళనాడులో బీజేపీని విస్తరించడానికి ఆయన చేసిన కృషి అసాధారణం. తమిళ సంస్కృతి పట్ల కూడా ఆయనకు తీవ్ర మక్కువ ఉండేది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి." అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గణేషన్ అయ్యర్ మృతి దేశ రాజకీయాలకు ఒక తీరని లోటని తెలిపారు.












Click it and Unblock the Notifications