మోడీపై నాగ్ ప్రశంసలు: అమలకు వద్దు, ఆశ్యర్యపోయా
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఆయనపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో తన భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని, తనకు గానీ తన భార్య అమలకు గానీ ఎలాంటి టిక్కెట్ అవసరం లేదన్నారు. తాను చాలాకాలంగా మోడీ గురించి వింటున్నాని చెప్పారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆహ్వానం మేరకు తాను మోడీని కలిసినట్లు చెప్పారు.
మోడీతో తన అభిప్రాయాలను పంచుకున్ననని, అది తన అదృష్టంగా భావిస్తున్నానని నాగ్ చెప్పారు. మోడీ ప్రధాని అవుతారని తాను భావిస్తున్నానని చెప్పారు. గుజరాత్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కొంత మీడియా తాను రాజకీయాల్లో చేరుతున్నట్లు ప్రచారం చేస్తోందని కానీ, తనకు రాజకీయాలు వద్దని చెప్పారు. తాను గానీ, తన భార్య గానీ టిక్కెట్‌ను ఆశించడం లేదని చెప్పారు. తన భేటీకి పొలిటికల్ అజెండా లేదన్నారు.

గుజరాత్ అభివృద్ధిని తాను చూశానని చెప్పారు. మోడీ ప్రధాని అయితే దేశాన్ని మారుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అయిన హైదరాబాదులోనే కరెంట్ తరుచూ పోతుంటుందని, అదే గుజరాత్‌లో గ్రామాల్లో సైతం ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఉంటోందన్నారు. గ్రామాల్లో సైతం వైఫైలు ఉన్నాయన్నారు. తాను రాజకీయ నాయకుడిని కాదని చెప్పారు.
మోడీ ప్రసంగాలు చూసి ఉత్తేజితుడినయ్యానని చెప్పారు. గుజరాత్‌లో పలు అభివృద్ధి పనులు చూశానని చెప్పారు. అభవృద్ధిలో గుజరాత్ దూసుకెళ్తోందన్నారు. గుజరాత్‌లో విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్నో గ్రామాలకు ఇంటర్నెట్, వైఫై ఉండటం గమనార్హమన్నారు.












Click it and Unblock the Notifications