నరసాపురం-తమిళనాడు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం స్టేషన్ నుంచి తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ఇవాళ ఓ శుభవార్త చెప్పింది. నరసాపురం నుంచి టుటికోరిన్ కు రెండు ప్రత్యేక రైళ్లు (Narasapur-Tuticorin special trains) ప్రకటించింది. ఈ రైళ్లు ఏయే తేదీల్లో అందుబాటులో ఉంటాయి, పూర్తి షెడ్యూల్, ఈ రైళ్ల హాల్ట్ లు, ఇలా పలు వివరాలను అధికారులు వెల్లడించారు. నరసాపురం నుంచి తమిళనాడుకు రాకపోకకలు సాగించే ప్రయాణికులు వీటిని గమనించాలని వారు కోరుతున్నారు.

రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధలో కీలక మార్పులు..! నిమిషానికి లక్షన్నర బుకింగ్స్ ..!
రైల్వే రిజర్వేషన్ వ్యవస్ధలో కీలక మార్పులు..! నిమిషానికి లక్షన్నర బుకింగ్స్ ..!

ముందుగా టుటికోరిన్ నుంచి నరసాపురానికి సెప్టెంబర్ 7 నుంచి ప్రత్యేక రైలు నంబర్ 06018ని ప్రకటించారు. ఈ రైలు టుటికోరిన్ లో రాత్రి 11.30కు బయలుదేరి మరుసటి రోజు అర్ధరాత్రి 12.20కు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైలు సెప్టెంబర్ 28 వరకూ అందుబాటులో ఉంటుంది. అలాగే నరసాపురం నుంచి మరో ప్రత్యేక రైలు నంబర్ 06017 సెప్టెంబర్ 9 నుంచి ప్రతీ బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు అంటే గురువారం తెల్లవారు జామున 4.30కు టుటి కోరిన్ చేరుకుటుంది. ఈ రైలు సెప్టెంబర్ 30 వరకూ అందుబాటులో ఉంటుంది.

Narasapur Tuticorin Special Trains Announced Check Schedule Route and Halts
Rayagada–Guntur Express: రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్పు..!
Rayagada–Guntur Express: రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ మార్పు..!

ఈ రెండు రైళ్లకూ ఏపీలో భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరుపద్రిపుల్యూర్, చిదంవరం, మైలాదితురై, కుంభకోణం, తంజావూరు, తిరుచ్చి, దిండిగల్, కొడైకెనాల్ రోడ్, మదురై, విరుదునగర్, సాతూర్, కోవిల్ పట్టి, టుటికోరిన్ మేలూర్ లో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే ఈ రెండు రైళ్లలోనూ ఒక సెకండ్ ఏసీ, రెండు థర్డ్ ఏసీ, 8 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+