లోకసభలో కుప్పకూలిన కొనకళ్ల, అదుపులో లగడపాటి!

న్యూఢిల్లీ: పార్లమెంటు చరిత్రలో ఈ రోజు దుర్దినమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గురువారం అన్నారు. లోకసభ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్‌‍ను డిగ్గీ పరామర్శించారు.

సభలో పడిపోయిన కొనకళ్ల

మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ లోకసభలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే ఢిల్లీలోని ఆర్ఎల్ఎం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, అతను బిల్లును వ్యతిరేకిస్తూ ఏదో తీసుకోవడం వల్లనే కుప్పకూలిపోయారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, గుండెపోటు వల్లనే అతని కుప్పకూలినట్లుగా తెలిసింది. కొనకళ్ల ఆరోగ్యం నిలకడగా ఉందని మరో టిడిపి ఎంపి సిఎం రమేష్ చెప్పారు. కొనకళ్లను అపోలో ఆసుపత్రికి తరలించారు.

Narayana Rao rushed to RML Hospital as he collapsed in Lok Sabha

మరోవైపు, లోకసభలో తీవ్ర పరిస్థితులు, పెప్పర్ స్ర్పే చేసిన తర్వాత లగడపాటి రాజగోపాల్‌ను పార్లమెంటు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన లోకసభ స్పీకర్ కార్యాలయంలో ఉన్నారని తెలుస్తోంది. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇతర సభ్యులకు హాని కలిగించారనే అభియోగం కింద కేసు పెట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+