Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెప్పులు మోసినా సీఎంకు నో టికెట్ -అదీ కాంగ్రెస్ దుస్థితి -పుదుచ్చేరి సభలో మోదీ -5రాష్ట్రాల్లో ఎన్డీఏ హవా

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాదిలో సుడిగాలి పర్యటన చేశారు. మూడు ఎన్నికల రాష్ట్రాల్లో వరుసగా భారీ సభల్లో పాల్గొన్నారు. తొలుత కేరళలోని పాలక్కాడులో, ఆపై తమిళనాడులోని ధారాపురంలో, చివరిగా పుదుచ్చేరిలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలి రెండు సభల మాదిరే పుదుచ్చేరిలోనూ ప్రత్యర్థులపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గడిచిన కొన్నేళ్లుగా కాంగ్రెస్ పాలనలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పూర్తిగా ఆగమైపోయిందని, అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ సర్కారు విఫలమైందని, చివరికి సిట్టింగ్ ముఖ్యమంత్రి నారాయణస్వామికి టికెట్ నిరాకరించడం కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి మచ్చుతునక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిటింగ్ సీఎంకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ఈ సారి ఎన్నికలు ప్రత్యేకమైనవిగా మారాయన్నారు.

Narayanasamy-led Cong govt in Puducherry was a disaster, nda wave in poll states, says pm Modi

పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అనేక ఏళ్లుగా కాంగ్రెస్ అధిష్ఠానానికి విధేయంగా ఉంటూ వచ్చారని, కాంగ్రెస్ అధినేతల చెప్పులను కూడా నారాయణ స్వామి మోశారని, కీలక నేత(రాహుల్ గాంధీ)ని ఆకట్టుకునేందుకు తప్పుడు అనువాదాలు కూడా చేశారని, పాపం ఇన్ని చేసినప్పటికీ నారాయణస్వామికి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వకపోవడం శోచనీయమని మోదీ ఎద్దేవా చేశారు. నారాయణస్వామిని పోటీ నుంచి పక్కకు తప్పించడాన్ని బట్టి పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

Narayanasamy-led Cong govt in Puducherry was a disaster, nda wave in poll states, says pm Modi

పుదుచ్చేరి సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీఏ హవా కనిపిస్తున్నదని, తాను పాల్గొన్న సభలన్నింటినీ ప్రజలు విజయవంతం చేశారని, అన్ని చోట్లా ఎన్డీఏ కూటములే విజయం సాధిస్తాయన్న నమ్మకం ఏర్పడిందని ప్రధాని మోదీ చెప్పారు. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగుతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+