మోడీ నాకన్నా పెద్ద నటుడు: గౌరీలంకేష్ హత్యపై ప్రకాశ్‌రాజ్ సంచలనం, అవార్డుపై అల్టిమేటం
ప్రధాని నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. తద్వారా మరోసారి అవార్డు వాపసీకి తెరలేపారు.
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. తద్వారా మరోసారి అవార్డు వాపసీకి తెరలేపారు.

నరేంద్ర మోడీ మౌనంపై ప్రకాశ్ రాజ్ ప్రశ్న
బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య పైన ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించడాన్ని నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు.

డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్
లెఫ్ట్‌కు చెందిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను హత్య చేసిన వారిని పట్టుకుంటారో లేదో తెలియదని, కానీ బయట మాత్రం సోషల్ మీడియాలో ఆమె హత్యపై చాలామంది సంతోషపడుతున్నారని వ్యాఖ్యానించారు.

మన దేశం ఎక్కడకు వెళ్తోంది
గౌరీ లంకేష్ హత్యపై సంతోషపడుతున్న వారు ఎవరో తమకు తెలుసునని, వారి ఐడియాలజీ కూడా తెలుసునని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇందులో మోడీ అనుచరులు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇది తనకు ఆందోళన కలిగిస్తోందని, మన దేశం ఎక్కడకు వెళ్తోందని వ్యాఖ్యానించారు.

నాకంటే పెద్ద నటుడు
తన ఫాలోవర్ల తీరుపై ప్రధాని మోడీ ఇంకా మౌనంగా ఉండటం విడ్డూరమని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇలా మౌనంగా ఉండటం ద్వారా తనకంటే పెద్ద నటుడిని అని మోడీ నిరూపించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు.

అవార్డులు వెనక్కిచ్చేందుకు కూడా ఆలోచించను
ప్రధాని మోడీ మౌనంపై తాను ఆందోళన చెందుతున్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఆయన మౌనంగా ఉండటం ద్వారా తన అనుచరుల దారుణాన్ని ఆమోదించినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాగే ఉంటే తనకు వచ్చిన ఐదు జాతీయ అవార్డులు వెనక్కి ఇచ్చేందుకు కూడా ఆలోచించనని చెప్పారు. తద్వారా అవార్డులు వెనక్కి ఇచ్చేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు.

ఇలాంటి వాటిని తీసుకెళ్లే నేతలు కావాలి
ఇలాంటి ఇష్యూలను (గౌరీ లంకేష్ హత్య) జాతీయస్థాయికి తీసుకు వెళ్లి ప్రభావం చూపే నేతలు కావాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. కానీ మనకు ఇప్పుడు అలాంటి వారు లేరన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications