నక్సల్స్‌లో చేరిపో: కేజ్రివాల్‌పై మోడీ ఫైర్, వెంకయ్యకు ప్రశంస
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవాస్తవాలు చెప్పేవారికి ప్రజల చేతిలో ఓటమి తప్పదని అన్నారు. అరచకవాదులుగా చెప్పుకుంటున్న వారు ప్రజలకు అవసరం లేదని అరవింద్ కేజ్రివాల్‌ను ఉద్దేశించి మోడీ అన్నారు. ఆమ్ ఆద్మీ నాయకులు వీధి పోరాటాల్లో నిపుణులు.. పాలనలో నిపుణులు కాదని వ్యాఖ్యానించారు.
అరాచకవాదినని చెప్పుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశారా? అని ప్రధాని మోడీ ప్రశ్నించారు. తాము అరచాకవాదులమంటూ పేర్కొంటున్న వారు అడవిలో ఉండే నక్సల్స్‌తో కలవొచ్చని కేజ్రివాల్‌ను ఉద్దేశించి అన్నారు. శనివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. ఇక్కడ అభివృద్ధికే చోటుుందని.. అది బిజెపితోనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టి ఇవ్వడమే తన లక్ష్యం అని, ఢిల్లీకి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రధాని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వారి కలలను, ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ పాలనపై విశ్వాసంతో ప్రజలు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో అపూర్వ విజయాన్ని అందించారని అన్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు చిరస్మరణీయ విజయం అందించారని మోడీ తెలిపారు. బీజేపీని విశ్వసించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు ఆయన తెలిపారు.

తాము కుల, మత, ప్రాంతీయ రాజకీయాలకు వ్యతిరేకమని, కేవలం అభివృద్ధి రాజకీయాలే తమ అజెండా అని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రేస్ హయాంలో బ్యాంకుల్లో పేదలు ఎప్పుడైనా కనిపించారా..? అని మోడీ ప్రశ్నించారు. వారి పాలనలో బ్యాంకుకు వెళ్లే తాహతు పేదలకు ఉండేది కాదని అన్నారు. చరిత్రను తిరగరాయడానికే ప్రధాని జన్‌ధన్ యోజన పథకాన్ని ప్రారంభించామని ఆయన తెలిపారు. ప్రతి పేదవాడికి ఖాతా ఉండాలన్న లక్ష్యం నెరవేరుతోందని అన్నారు. పేదరిక నిర్మూలనో విజయం సాధిస్తామని అన్నారు..
వెంకయ్యనాయుడుపై ప్రశంసలజల్లు
ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. వెంకయ్య నాయుడుకి ఉన్న అవగాహనా శక్తిని చూస్తే ఆశ్చర్యమేస్తోందని మోడీ అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సమస్యలు తెలిసిన నేత వెంకయ్య అని మోడీ కొనియాడారు.
వెంకయ్యకు హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, విశాఖల కన్నా ఢిల్లీ గురించి, ఇక్కడి ప్రజల కష్టాలు గురించి బాగా తెలుసునని అన్నారు. అంతేకాకుండా ఢిల్లీ, హర్యానా ప్రజల తాగునీటి సమస్యలపై వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారని ప్రధాని తెలిపారు. ఈమేరకు ఆయనను ప్రధాని అభినందించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించి మాఫీయా రాజ్యాన్ని అంతమొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications