వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతి, శశికళ సిద్దం, నోరు విప్పిన భర్త, పన్నీర్ కు పని లేదు, పళనిసామికి !

కార్యకర్తల మద్దతుతో అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యేందుకు శశికళ సిద్దంగా ఉన్నారని ఆమె భర్త నటరాజన్ అన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: కార్యకర్తల మద్దతుతో అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక అయ్యేందుకు శశికళ సిద్దంగా ఉన్నారని ఆమె భర్త నటరాజన్ అన్నారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని ఎన్నికల కమిషన్ రద్దు చేసిన పక్షంలో ఎన్నికల ద్వారా మళ్లీ ఎన్నిక అయ్యేందుకు శశికళ సిద్దంగా ఉన్నారని నటరాజన్ చెప్పారు.

<strong>టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు: సీఎం పళనిసామి ముందు చేతులు కట్టుకుని గుప్ చిప్ !</strong>టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు: సీఎం పళనిసామి ముందు చేతులు కట్టుకుని గుప్ చిప్ !

రెండాకుల చిహ్నం అమ్మ శిబిరానికి దక్కుతుందని నటరాజన్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో జయలలిత మరణం, పన్నీర్ సెల్వం ఆరోపణలు, సీఎం ఎడప్పాడి పళనిసామి, శశికళ మధ్య ఉన్న విభేదాల విషయాల గురించి మాట్లాడారు.

జయలలిత మరణంపై !

జయలలిత మరణంపై !

జయలలితకు అందించిన చికిత్స విషయాల గురించి ఇప్పటికే అపోలో, ఎయిమ్స్, లండన్ వైద్యులు పూర్తి వివరాలు వివరించారని అన్నారు. అలాంటప్పుడు జయలలిత మరణంపై అనుమానాలు ఎందుకు వస్తాయని నటరాజన్ ప్రశ్నించారు.

పన్నీర్ సెల్వంకు పని లేదు !

పన్నీర్ సెల్వంకు పని లేదు !

జయలలిత మరణం విషయంలో రాజకీయ లబ్ది కోసం పన్నీర్ సెల్వం ఆరోపణలు చేస్తున్నారని నటరాజన్ మండిపడ్డారు. అయితే పనిలేకనే పన్నీర్ సెల్వం ఇలా ఆరోపణలు చేస్తున్నారని, అనుమానం అనేది ఉండి ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత మరణంపై ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదని నటరాజన్ ప్రశ్నించారు.

జయలలిత అంటే శశికళకు !

జయలలిత అంటే శశికళకు !

జయలలిత మీద శశికళకు ఎంతో గౌరవం ఉందని నటరాజన్ చెప్పారు. జయలలిత ఆరోగ్యం విషయంలో శశికళ సూచనలు, సలహాలు ఇచ్చారో ? లేదో ? తనకు తెలీదని అన్నారు. అయితే జయలలితకు ఆరోగ్య సూచనలు ఇచ్చే అవకాశం శశికళకు ఎక్కువగానే ఉందని నటరాజన్ వివరించారు.

అధికారులు చెప్పి ఉంటే

అధికారులు చెప్పి ఉంటే

సచివాలయం నుంచి బయటకు వచ్చే సమయంలో, కారు ఎక్కే సమయంలో జయలలితకు సహాయంగా భద్రతాధికారులు చేతిని అందించే వారని, ఆ అధికారులైనా అమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త అని సూచించి ఉంటే అమ్మ ఇంకా ఎక్కువ కాలం బతికి ఉండేవారని నటరాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

శశికళ నేటికీ జీర్ణించుకోలేదు

శశికళ నేటికీ జీర్ణించుకోలేదు

జయలలిత మరణించిన విషయాన్ని శశికళ నేటికీ జీర్ణించుకోలేకున్నట్లు నటరాజన్ చెప్పారు. జయలలిత మరికొంత కాలం తమిళ ప్రజలకు సేవ చేస్తారని శశికళ భావించినట్లు చెప్పారు. జయలలిత తన ఆరోగ్యం విషయంలో నిర్లక్షం చేశారని నటరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు.

శశికళ జోక్యం చేసుకోలేదు

శశికళ జోక్యం చేసుకోలేదు

జయలలిత అధికారంలో ఉన్న సమయంలో శశికళ ఒక్క సారి కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని ఆమె భర్త నటరాజన్ అన్నారు. జయలలితను అపోలో ఆసుపత్రిలో చేర్పించే సమయంలో ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా వెన్నంటి ఉన్నారని ఓ ప్రశ్నకు నటరాజన్ సమాధానం చెప్పారు.

పళనిసామి VS శశికకళ

పళనిసామి VS శశికకళ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, శశికళ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ నటరాజన్ చెప్పారు. ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రి చేసింది శశికళ అనే విషయం గుర్తు చేశారు. వీలులేకపోవడం వలనే పళనిసామి బెంగళూరు వెళ్లి శశికళను కలవలేదని మాట దాట వేశారు.

మళ్లీ మన్నార్ గుడి మాఫియా

మళ్లీ మన్నార్ గుడి మాఫియా

తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పడానికి మన్నార్ గుడి మాఫియా సిద్దం అవుతోందని మరో సారి వెలుగు చూసింది. ఓ జాతీయ మీడియాకు నటరాజన్ ఇంటర్వూ ఇచ్చి పార్టీ పగ్టాలు చేపట్టడానికి అవసరం అయితే శశికళ పోటీకి సిద్దంగా ఉన్నారని చెప్పారు.

రెండు రోజుల్లో సుప్రీం కోర్టులో

రెండు రోజుల్లో సుప్రీం కోర్టులో

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ కోర్టు ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈనెల ఆరో తేదీన శశికళ సమర్పించిన పిటిషన్ విచారణకు రానుంది. శశికళ రాజకీయ భవిష్యత్తు ఏమిటి ? అంటూ ఆమె శిభిరంలోని నాయకులు వేచి చూస్తున్నారు.

English summary
Natarajan says that an enquiry in Jayalalitha's death was ridiculous. He said in an interview which is given to NewsX channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X