నేషనల్ హెరాల్డ్ కేసు: 'ఇందిర కోడలిని, ఎవరికీ భయపడను'
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. మంగళవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, కోర్టు మరోసారి వారికి అవకాశం ఇచ్చింది. ఈ నెల 19న కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది.
కేవలం నాలుగు నిమిషాల్లోనే ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఈరోజు తీర్పును వెల్లడించింది. నిధుల దుర్వినియోగం కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుతో పాటు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న సోనియా, రాహుల్ గాంధీ పిటిషన్లను సోమవారం ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఈరోజు విచారణకు వారు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది.
సోనియా, రాహుల్ తరుపున కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఉత్సాహంగా కోర్టుకు వచ్చారు. కాగా, ఈ కేసులో తమ నేతలు కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని, తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు.
I have arrived in Patiala House with team. Yatinder in SC in CJI court.
— Subramanian Swamy (@Swamy39) December 8, 2015 Ruling party in power using proxy litigation to attack senior Congress persons out of political malice-AM Singhvi pic.twitter.com/1oZeyQXPCe
— ANI (@ANI_news) December 8, 2015 ఇది ఇలా ఉంటే, ఈరోజు ఉదయమే రాహుల్ గాందీ పుదుచ్చేరి పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలోనే ఉన్నప్పటికీ సోనియా గాంధీ కూడా కోర్టుకు వెళ్లలేదు. ఈ కేసుకు సంబంధించి సోనియాగాంధీని జర్నలిస్టులు పలుమార్లు ప్రశ్నించడంతో తాను ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని 'మీరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి' అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. మరో ప్రశ్నకు సమాధానంగా 'దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలిని.. ఎవరికీ భయపడను' అని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు.
Rahul Gandhi has left on a visit to floodhit chennai. Sonia to be in parliament as national herald case comes up in trial court.
— Subodh Ghildiyal (@subodhgTOI) December 8, 2015 Subramanian Swamy and Congress leader Abhishek Manu Singhvi reach Patiala House Court in Delhi. pic.twitter.com/L385SBNndc
— ANI (@ANI_news) December 8, 2015 రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. కాగా, నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేసిన విషయం తెలిసిందే.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications