జగన్‌కు పట్నాయక్ మద్దతు, 20నిమిషాలు ఇంట్లో భేటీ

ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడారు. రాష్ట్ర విభజన అనేది సమాజాకి, రాజకీయ, ప్రజల అభిప్రాయమని, ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని, ఎపి విభజనపై ఇంత వరకు సరైనరీతిలో చర్చలు జరగలేదన్నారు. తెలంగాణపై జగన్ తనతో చర్చించినట్లు పట్నాయక్ చెప్పారు.
ఎపి విభజనకు కేంద్రం చేపడుతున్న ప్రక్రియ రాజ్యాంగానికే వ్యతిరేకమని, దీనిని అన్ని రాష్ట్రాల వారు వ్యతిరేకించాలని జగన్ కోరారు. లేదంటే ముందు ముందు అన్ని రాష్ట్రాలకు ఇలాంటి ప్రమాదం వచ్చే ఆస్కారముందని హెచ్చరించారు. విభజన పేరిట కాంగ్రెసు ఎపిని దయనీయస్థితిలోకి నెట్టిందని విమర్శించారు.
విభజన విషయంలో కేంద్రం వైఖరిని వ్యతిరేకించాలని నవీన్ పట్నాయక్‌ను కోరినట్లు జగన్ చెప్పారు. ప్రజల అంగీకారం, శాసన సభ, పార్లమెంటు తీర్మానాల అనంతరం విభజనకు నిర్ణయాలు తీసుకోవాలని, అలాంటిదేమీ జరగకుండా రాజకీయ లబ్ధి కోసం కేంద్రం నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఏకపక్ష విభజనను అందరూ అడ్డుకోవాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంటులలో మూడింట రెండు వంతుల మద్దతు ఉంటేనే రాష్ట్ర విభజన చేపట్టేలా ఆర్టికల్ 3ని సవరించాలని కోరారు. ఇరువురి నేతలు నవీన్ పట్నాయక్ ఇంట్లో దాదాపు ఇరవై నిమిషాలు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications