ఓఎన్‌జీసీలో భారీ అగ్ని ప్రమాదం: ఐదుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓఎన్‌జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు.

నేవీ ముంబైలోని ఉరాన్ ప్రాంతంలో ఉన్న ఓఎన్‌జీసీ ప్లాంటులో మంగళవారం ఉదయం 6.45గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకున్న కాసేపటికే మంటలు భారీగా ఎగిసిపడి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. కార్మికులు పనిచేస్తున్న సమయంలోనే ప్రమాదం చోటు చేసుకోవడంతో కొందరు కార్మికులు తప్పించుకోలేకపోయారు.

 Navi Mumbai: 5 killed, 3 injured in Uran ONGC plant fire

ఐదుగురు కార్మికులు ఈ ప్రమాదంలో మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు సీఐఎస్ఎఫ్ ఫైర్‌మెన్ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఉరాన్, పన్వేలు, నెరూల్, జేఎన్‌పీటీ ప్రాంతాల నుంచి ఫైరింజిన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి.

అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఉరాన్ నుంచి గ్యాస్‌ను గుజరాత్‌లోని హజీరా ఓఎన్‌జీసీ ప్లాంటుకు తరలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+