కేంద్రానికి సిద్ధూ వార్నింగ్- ఛలో లఖీంపూర్ హెచ్చరిక- ఆశిష్ అరెస్ట్, ప్రియాంక విడుదల కాకపోతే
ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ లో రైతులపై కారు పోనిచ్చి ఎనిమిది మృతికి కారకుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఆశిష్ ను అరెస్టు చేయకుండా లఖీంపూర్ వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని అరెస్టు చేసి నిర్బంధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వివాదంపై పంజాబ్ పీసీసీ మాజీ ఛీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ తీవ్రంగా స్పందించారు.
లఖీంపూర్ ఖేరీ ఘటన, అనంతర పరిణామాలపై స్పందించిన సిద్ధూ... కేంద్రానికి స్టాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. లఖీంపూర్ ఘటనకు బాధ్యుడైన ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయడంతో పాటు ప్రియాంకగాంధీని విడుదల చేయకపోతే అక్కడికి ర్యాలీగా రావాల్సి ఉంటుందని కేంద్రాన్ని సిద్ధూ హెచ్చరించారు. రేపటి కల్లా ఈ రెండు అంశాలపై నిర్ణయం తీసుకోకపోతే పంజాబ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీకి రావాల్సి ఉంటుందని సిద్ధూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ వివాదాలతో బిజీగా ఉన్న సిద్ధూ... యూపీలో జరుగుతున్న పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా లఖీంపూర్ లో సిక్కు రైతులపై జరిగిన దాష్టికం నేపథ్యంలో సిద్దూ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. లఖీంపూర్ కు సిద్ధూ, కాంగ్రెస్ నేతలతో బయలుదేరితే తలెత్తే పరిణామాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. లఖీంపూర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎస్పీ అధినేత అఖిలేష్, ప్రియాంక, ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ సహా పలువురిని యూపీ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నా లెక్క చేయడం లేదు. దీంతో లఖీంపూర్ కు ర్యాలీగా వస్తామని సిద్ధూ చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమవుతున్నాయి.
మరోవైపు లఖీంపూర్ ఘటనకు తాము బాధ్యులం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాతో పాటు ఆయన కుమారుడు ఆశిష్ కూడా చెప్తున్నారు. ఆశిష్ ను ఇప్పటివరకూ అరెస్టు చేయకపోవడంపై రైతులతో పాటు విపక్ష పార్టీలు సైతం కన్నెర్ర చేస్తున్నాయి. దీంతో కేంద్రంతో పాటు .యూపీలోని ఆదిత్యనాథ్ సర్కార్ కూడా ఇరుకునపడుతున్నాయి. లఖీంపూర్ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇప్పటికే సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుతున్నారు.
-
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications