వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో బీజేపీ ఖేల్ ఖతం ..సత్యమేవ జయతే:సుప్రీం నిర్ణయంపై ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ముఖ్య నేతలు

|
Google Oneindia TeluguNews

సుప్రీంకోర్టు తీర్పుతో మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. బుధవారం సాయంత్రాని కల్లా మహారాష్ట్రలో బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించిన తీర్పుపై అటు కాంగ్రెస్ , ఎన్సీపీ, శివ సేన ముఖ నాయకుల నుండి హర్షం వ్యక్తం అవుతుంది. బీజేపీకి మాత్రం ఇది విషమ పరీక్షలా మారింది. రేపు సాయంత్రం లోగా బాల నిరూపణ చేసుకోవాల్సి ఉంది.
సుప్రీం తీర్పు చారిత్రాత్మక నిర్ణయం అన్న సోనియాగాంధీ

ఇక తాజాగా సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పు చారిత్రాత్మక నిర్ణయం అని సోనియాగాంధీ అభివర్ణించారు. రేపు జరిగే బలపరీక్షలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల నేతృత్వంలోని 'మహారాష్ట్ర ప్రగతిశీల కూటమి' విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమాగా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కొద్ది నిమిషాలకే సోనియాగాంధీ సుప్రీం తీర్పును స్వాగతిస్తూ తన స్పందనను తెలియజేశారు.

మహా పాలిటిక్స్: గవర్నర్ వద్దకు ప్రోటెం స్పీకర్ గా ఆరుగురి పేర్లు..ఎవరెవరంటేమహా పాలిటిక్స్: గవర్నర్ వద్దకు ప్రోటెం స్పీకర్ గా ఆరుగురి పేర్లు..ఎవరెవరంటే

బీజేపీ ఖేల్ ఖతం అన్న ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్

బీజేపీ ఖేల్ ఖతం అన్న ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్

మరోవైపు ఎన్సీపీ సైతం సుప్రీం తీర్పుపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నాం అని పేర్కొన్నారు. రేపు జరిగే బలపరీక్షలో గెలవగల సంఖ్యాబలం తమకు ఉందన్న నవాబ్ మాలిక్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు మైలు రాయి లాంటిదని వ్యాఖ్యానించారు. సత్యమేవ జయతే అంటూ బిజెపి ఖేల్ ఖతం అంటూ ఆయన ట్వీట్ చేశారు. రేపు 5 గంటల్లోగా అంతా తేలిపోతుందని మేము భావిస్తున్నాం. ఇక బీజేపీ పని అయిపోయిందని ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మలిక్ పేర్కొన్నారు.

 చివరకు సత్యమే గెల్చింది అన్న శివసేన నేత సంజయ్ రావత్

చివరకు సత్యమే గెల్చింది అన్న శివసేన నేత సంజయ్ రావత్

24 గంటల్లోగా మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇవాళ వెలువరించిన తీర్పుపై శివసేన పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో అజిత్ పవార్ సృష్టించిన సంక్షోభం నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్-ఎన్సీపీ మరియు శివసేన కూటమి విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో చివరికి సత్యమే గెలించిందంటూ ఆ పార్టీ సంజయ్ రావత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ ట్విటర్లో స్పందిస్తూ.. సత్యానికి ఆటంకాలు ఎదురుకావచ్చు. కానీ సత్యం ఎప్పుడూ ఓడిపోదు... జైహింద్ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 మహా గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు

మహా గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు

మహారాష్ట్ర గవర్నర్ భగత్ కోష్యారీ హడావుడిగా బిజెపికి అధికారాన్ని కట్టబెట్టడం, ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ను ప్రమాణస్వీకారం చేయించడం, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయడం, సంఖ్యాబలం లేకుండానే బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన తీర్పు వెలువరించింది.

కోర్టు తీర్పుతో జోష్ లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి

కోర్టు తీర్పుతో జోష్ లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి

ప్రొటెం స్పీకర్ సారథ్యంలో రేపు సాయంత్రంలోగా సభ్యుల చేత ప్రమాణాలు చేయించి బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. అయితే నిన్న రాత్రి తమకు మొత్తం 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనీ పెరేడ్ నిర్వహించిన ఎన్సీపీ మరియు శివసేన కూటమి తమ సంఖ్యాబలాన్ని ప్రదర్శించింది. ఇక ఈ రోజు సంజయ్ రావత్ కూడా ఇదే విషయాన్ని ఉదయం ట్వీట్ చేశారు. ఇప్పుడు తాజాగా కోర్టు తీర్పుతో ఈ మూడు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

English summary
Maharashtra politics has come to a head with the Supreme Court ruling. The Congress, NCP and Shiv Sena's leaders have expressed their pleasure over the Supreme Court's verdict today in Maharashtra on Wednesday evening. For the BJP, it has become a serious test. They have to prove it by tomorrow evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X