వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరద్ పవార్‌కు శస్త్రచికిత్స చేసిన బ్రీచ్ కాండీ వైద్యులు... ఎనిమిది రోజుల ఆసుపత్రిలోనే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్‌సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌‍కు ముంబై వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తన నివాసంలో కాలుజారి కిందపడటంతో గాయపడ్డారు. దీంతో శరద్ పవార్‌ను ఎయిర్ ఆంబులెన్స్‌లో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.

ఆయన కాలికి డాక్టర్లు మైనర్ సర్జరీ చేశారని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ శుక్రవారం మధ్యాహ్నం మీడియాకు వెల్లడించారు. మరో ఎనిమిది రోజుల పాటు పవార్ ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించినట్టు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ గురువారం ఆసుపత్రికి విచ్చేసి, శరద్ పవార్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భార్య ప్రతిభ, కూతురు సుప్రియా సూలే ఆయన వెంట ఉన్నారు.

NCP's Sharad pawar to undergo leg surgery in Mumbai today

జనపథ్ బంగళాలో దైనందిన కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ వాక్ చేస్తుండగా జారిపడ్డారు. కాంగ్రెసుకు రాజీనామా చేసిన శరద్ పవార్ 1999లో ఎన్సిపీని స్థాపించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన మూడు పర్యాయాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. యుపిఎ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేశారు.

English summary
NCP chief Sharad Pawar who fell down at his residence on December 2 in the night, will undergo a surgery at the Breach Candy hospital in Mumbai today. As per reports, he suffered from a leg injury after the fall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X