NEET PG 2025: నీట్ పీజీ పరీక్ష వాయిదా..! సుప్రీం ఉత్తర్వుల ఎఫెక్ట్..!
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పీజీ ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ ఏడాది నీట్ పీజీ పరీక్ష అనూహ్యంగా వాయిదా పడింది. ఈ మేరకు వైద్యశాస్త్ర పరీక్షల జాతీయ బోర్డు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ పరీక్ష వాయిదా వేయడానికి గల కారణాలను కూడా బోర్డు వెల్లడించింది. సింగిల్ షిఫ్ట్ లోనే పరీక్ష నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి.
నీట్ పీజీ పరీక్ష జూన్ 15న జరగాల్సి ఉంది. అయితే ఎంబీబీఎస్ తో పాటు డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు రెండు షిఫ్ట్ లకు బదులుగా ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సింగిల్ షిఫ్ట్ లో పరీక్ష నిర్వహణ సాధ్యం కాకపోవడంతో బోర్డు ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది.

జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షల్లో అక్రమాలపై ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పారదర్శకత ఉండాలంటే సింగిల్ షిఫ్ట్ లో పరీక్షలు నిర్వహిచాలని సుప్రీంకోర్టు సూచించింది. అలాగే సురక్షితమైన పరీక్షా కేంద్రాల్ని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే ఇవాళ పీజీ పరీక్షల్ని వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు నిర్ణయం అమలు చేయాలంటే పలు సర్దుబాట్లు చేయాల్సి ఉంటుందని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో ముఖ్యంగా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచడం, అభ్యర్థులందరికీ ఒకేసారి వసతి కల్పించడానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలున్నట్లు పేర్కొంది. కాబట్టి ఆ మేరకు ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపింది. త్వరలోనే నీట్ పీజీ పరీక్షల కొత్త తేదీ వెల్లడిస్తామని పేర్కొంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications