NEET PG పరీక్ష వాయిదా- 6 నుంచి 8 వారాల పాటు-పీజీ కౌన్సెలింగ్ కు అడ్డుకాకూడదనే
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష 2022 వాయిదా పడింది. మార్చిలోనే నీట్ పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు పరీక్ష వాయిదా వేయాలని విద్యార్ధుల నుంచి అభ్యర్ధనలు వచ్చాయి. దీంతో కేంద్రం దీన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
నీట్ పీజీ పరీక్ష 2022ను ఆరు నుంచి 8 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మార్చి 12 జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెలలో నీట్ పీజీ కౌన్సెలింగ్ జరగాల్సి ఉన్నందున దాని షెడ్యూల్ తో క్లాష్ కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి నీట్ పరీక్ష వాయిదా వేయాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కూడా జరుగుతోంది.
పిటిషనర్లు చాలా మంది కోవిడ్ విధుల్లో బిజీగా ఉన్నారని, వారి ఇంటర్న్‌షిప్‌లు వాయిదా పడ్డాయని, దీని కారణంగా, మే 31, 2022న షెడ్యూల్ చేసిన ఇంటర్న్‌షిప్ గడువును వారు చేరుకోలేరని పేర్కొన్నారు. ఈ గడువును పొడిగించాలని కోరారు.

Recommended Video
మరోవైపు నీట్ పీజీ పరీక్ష నుంచి తమిళనాడు నుంచి మినహాయించాలని రాష్ట్ర అసెంబ్లీ చేసి పంపిన తీర్మానాన్ని గవర్నర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష వాయిదా కు మద్దతివ్వాలని కోరుతూ పలు రాష్ట్రాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు కూడా రాశారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో కొత్త తేదీలు విడుదల చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది.












Click it and Unblock the Notifications