నేపాల్ భూకంపం: మోడీకి ఇజ్రాయిల్ ప్రధాని థ్యాంక్స్, 6,200కు చేరిన మృతుల సంఖ్య
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీకి ఇజ్రాయిల్ జెంజమిన్ నేతాన్యహు థ్యాంక్స్ చెప్పారు. నేపాల్ భూకంపంలో చిక్కుకున్న తమ ప్రజలకు సహాయక చర్యలు అందిస్తున్నందుకు గాను ఆయన ఈ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోడీతో ఆయన ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని స్వయంగా మోడీనే ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. నేపాల్ భూకంపంలో చిక్కుకున్న ఇజ్రాయిల్ ప్రజల కోసం ప్రత్యేక హెలికాప్టర్లు పంపినందుకు ధన్యవాదాలు తెలిపినట్టు ఉన్నాతాధికారులు వెల్లడించారు.
I spoke to PM @netanyahu, who had called to extend condolences on the loss of lives due to the Earthquake.
— Narendra Modi (@narendramodi) April 30, 2015 My gratitude to PM @netanyahu for his kind words on India's relief & rescue efforts in Nepal including help extended to Israeli nationals.
— Narendra Modi (@narendramodi) April 30, 2015 నేపాల్ భూకంపంలో మరణించిన భారత కుటుంబ బాధితులకు ఆయన సంతాపం కూడా తెలిపారు. గత శనివారం నేపాల్ సంభవించిన భూకంపంలో ఇజ్రాయిల్‌కు చెందిన ప్రజలు చిక్కుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 మంది ఇజ్రాయిల్ వాసులను సురక్షితంగా స్వదేశానికి చేర్చారు.
మిగిలిన వారిని రక్షించేందుకు గాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఇజ్రాయిల్ ఆ దేశపు ఆర్మీని పంపించింది. నేపాల్‌లో మామాలు పరిస్ధితి వచ్చే వరకు మరో రెండు వారాల పాటు ఇజ్రాయిల్ ఆర్మీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటుందని తెలిపారు.

గత శనివారం సంభవించిన నేపాల్ భూకంపం రాజధాని ఖాఠ్మండులోని సుమారు 80 లక్షల మందిపై ప్రభావం చూపింది. భూకంపం సంభవించి ఐదు రోజులు గడుస్తున్నా, సాధారణ పరిస్ధితులు రాకపోగా, మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకు 6,200 మందికి పైగా మృతిచెందగా, 13,932మంది గాయపడినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.
మృతుల సంఖ్య 15వేల వరకు పెరగొచ్చని నేపాల్ ఆర్మీ ఛీఫ్ జనరల్ గౌరవ్‌రానా తెలిపారు. శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications