షాక్: రూ. 152 కోట్లు సీజ్, బ్యాంకుపై ఈడీ దాడులు
బెంగళూరు: బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. బ్యాంకుల్లోని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
బెంగళూరు నగరంలోని కెనరా, ఆక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల శాఖల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పాత రూ. 1,000, రూ. 500 నోట్ల రద్దు అయిన తరువాత బెంగళూరు నగరంలో పెద్ద ఎత్తున పాత నోట్ల మార్పిడి చేశారని ఆరోపణలు వచ్చాయి.

అదే సమయంలో బెంగళూరులోని ఇద్దరు అధికారుల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు రూ. 4.70 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులు పెద్ద ఎత్తున బ్లాక్ మనీని బ్యాంకు అధికారుల సహాయంతో వైట్ మనీగా మార్చిడి చేశారని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.
ఈ సమయంలో ఈడీ అధికారులు దాడులు చెయ్యడంతో అవినీతి బ్యాంకు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొత్తం మీద ఈడీ అధికారులు పూర్తి వివరాలు చెప్పే వరకు ఎంత మొత్తంలో బ్లాక్ మనీ వైట్ మనీ అయ్యింది ? అనే విషయం తెలీదు.












Click it and Unblock the Notifications