కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ: 15ఏళ్ల నాటి కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.15 ఏళ్ల నాటి భూకేటాయింపుకు( భూముల డీనోటిపికేషన్ కేసు) సంబంధించిన కేసులో ఆయనపై దర్యాప్తును ముగించాలని కోరుతూ లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బీ-రిపోర్ట్ ను శనివారం బెంగలూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో లోకాయుక్త డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారితో దర్యాప్తునకు కొనసాగించడం సహా తుది నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో జాప్యంపై కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించింది.

వర్తూర్-వైట్‌ఫీల్డ్ ఐటీ కారిడార్ పరిధిలోని బెల్లాండూర్, దేవం బీసనహళ్లిలోని విలువైన భూమి డీనోటిఫికేషన్‌కు సంబంధించి యడ్యూరప్ప అవతవకలకు పాల్పడ్డారంటూ వాసుదేవ రెడ్డి అనే వ్యక్తి లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేశారు. అప్పుడు నాటి జేడీఎస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
కాగా, కోర్టు ఆదేశాల మేరకు 2015, ఫిబ్రవరి 21న అవినీతి నిరోధక చట్టం కింది లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తును ముగించాలని కోరుతూ 2020 డిసెంబర్ నెలలో యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషన్లను తిరస్కరించిన కోర్టు.. దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications