డీజిల్ కార్లు: మరో 11 సిటీల్లో బ్యాన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మకం నిషేధం దేశంలోని మరో 11 నగరాల్లో అమలు చెయ్యాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్ జీటీ) సోమవారం నిర్ణయం తీసుకుంది. 11 నగరాల్లో గాలి కాలుష్య డేటా ఆధారంగా ఎన్ జీటీ ఈ నిషేధాన్ని అమలు చెయ్యనుంది.
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కత్తా, పట్నా, అలహాబాద్, లక్నో, వారణాసి, పూణే, కాన్పూర్, నాగ్ పూర్, జలంధర్, లూథీయానా, అమృత్ సర్ వంటి నగరాల్లో అమలు చెయ్యాలని నిర్ణయించారు. 2015 డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నియమాలు అమలు చేశారు.

ఢిల్లీ నగరం, పరిసర ప్రాంతాల్లో పెద్ద డీజిల్ కార్ల సంచారాన్ని నిషేదిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ వాహనాల అమ్మకాలు జరగడం లేదు. కేరళలోని కొన్ని నగరాల్లో ఈ నిషేదం అమల్లోకి తీసుకువచ్చారు.
దీంతో ఆటో పరిశ్రమలో పెట్టుబడులు కోల్పోయారు. దాదాపు 11 వేల వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. ఆటో పరిశ్రమలో 5,500 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నిషేదం దేశమంతటా విధిస్తే 44 వేల ఉద్యోగాలకు నష్టం చేకూరుతుందని సియామ్ రిపోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications