రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే? బాంబర్ తో అన్ని నెలలు!
బెంగళూరులోని రామేశ్వర్ కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి కొత్తకొత్త సమాచారం వెలుగులోకి వస్తోంది. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడుకు సహకరించిన నిందితుడు ముజామిల్ షరీఫ్ ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడని అధికారులు అంటున్నారు.
ముజామిల్ షరీఫ్ ను ఎన్ఐఏ అధికారులు విచారించారు. నిందితుడు ముజామిల్ షరీఫ్ రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు నిందితుడు బాంబర్ గురించి మాట్లాడని వెలుగు చూసింది తన క్లాస్ మేట్ ద్వారా రామేశ్వరం కేఫ్ బాంబర్ తనకు పరిచయం అయ్యాడని ముజామిల్ షరీఫ్ అంగీకరించాడని వెలుగు చూసింది. ఇంతకీ ఈ ముజామిల్ షరీఫ్ ఎవరు? అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లికి చెందిన మోస్ట్ వాంటెడ్ అబ్దుల్ మతీన్ తహానే అనే నిందితుడు ఈ ముజామిల్ షరీఫ్ క్లాస్‌మేట్. ఎస్‌ఎస్‌ఎల్‌సీ (10వ తరగతి) వరకు క్లాస్‌మేట్స్‌గా ఉన్న మతీన్ తాహానే, ముజామిల్ షరీఫ్‌లు తరువాత దూరంగా ఉన్నప్పటికీ ఫోన్‌లో టచ్‌లో ఉన్నారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. దీని తర్వాత మతీన్ తహాన్ ఆరు నెలల క్రితం చికెన్ కౌంటీలో పనిచేస్తున్న అతని క్లాస్ మేట్ ముజామిల్ షరీఫ్‌ను సంప్రదించాడు.
ఆరు నెలల క్రితం మళ్లీ కలుసుకున్న మతీన్ తహాన్ అతని స్నేహితుడు ముజామిల్ షరీఫ్ కు బాంబర్ ముసావీర్ ను పరిచయం చేశాడు. తరువాత బాంబర్ ముసావిర్‌కు సహాయం చేయమని షరీఫ్‌కు అతని క్లాస్ మేట్ మతీన్ తహాన్ సూచించాడు. ముజామిల్ షరీఫ్ అతని స్నేహితుడు మతీన్ తాహాన్ సూచించినట్లు ముసావిర్‌కు సహాయం చేశాడు. ఇలా బెంగళూరులో బాంబు పెట్టేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ముజామిల్ షరీఫ్ కల్పించాడని వెలుగు చూసింది.

అంటే బెంగుళూరు బాంబు పేలుళ్లకు ఆరు నెలలుగా ప్లాన్ వేశారని అధికారుల విచారణలో వెలుగు చూసింది. ప్రస్తుతం అరెస్టు అయిన ముదిగెరెకు చెందిన ముజామిల్ షరీఫ్‌ను ఎన్‌ఐఏ గురువారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. నిందితుడు ముజామిల్ షరీఫ్ ను ఏడు రోజుల పాటు విచారణ చెయ్యడానికి ఎన్‌ఐఏ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశించింది.
ఏప్రిల్ 3వ తేదీ వరకు ముజాహిల్ షరీఫ్ ఎన్ఐఏ కస్టడీకి ఇస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చెయ్యడంతో అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు. 10వ తరగతి క్లాస్ మేట్ కోసం అతను సూచించిన వ్యక్తికి ఆశ్రయం ఇచ్చిన ముజాహిల్ షరీఫ్ ఇప్పుడు కటాకటాలు లెక్కపెడుతున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుల కోసం ఎన్ఐఏ అధికారులు ఇంకా గాలిస్తున్నారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications