బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో బాంబు పెట్టింది వీడే, ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చెయ్యండి !

గళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల నిందితుడి స్పష్టమైన ఫొటోను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విడుదల చేసింది. అతని గురించి ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఎన్ఐఏ అధికారులు కోరారు.బెంగళూరులోని కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐబీ) బాంబుదాడి జరిపిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

ఈ నేప‌థ్యంలో బాంబ‌ర్‌కు సంబంధించిన అన్ని ట్రాఫిక్ క్లూస్ చెక్ చేసినా బాంబర్ మాత్రం పోలీసుల కంట ప‌డ‌కుండా తిరుగుతున్నాడు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరిపిన తరువాత నిందితుడు కర్ణాటకలోని బళ్లారిలో సంచరిస్తున్న సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన పుటేజీల ఆధారంగా కేఫ్ బాంబును పేల్చిన నిందితుడి స్పష్టమైన ఫొటోలను సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ ఆ ఫోటోను శనివారం మద్యాహ్నం విడుదల చేసింది.

NIA officials have released photos of the Bengaluru Rameswaram Cafe blast suspect

బళ్లారిలో అనుమానిత ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న 4 ఫోటోలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోషల్ మీడియా నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్‌లో షేర్ చేసింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలుడు జరిపిన నిందితుడిని పట్టుకోవడంలో ప్రజల సహకారం కోసం ఒక ఫోటో విడుదల చేయబడింది. ఈ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే, 080- 29510900, 8904241100 లేదా [email protected]కు ఇమెయిల్ చేయాలని ఎన్ఐఏ అధికారులు మనవి చేశారు.

బెంగళూరులోని కుందనహళ్లిలోని రామేశ్వరం కేఫ్ లో మార్చి 1వ తేదీన బాంబు పేలుడు జరిపిన తరువాత నిందితుడు పలు ప్రాంతాలకు వెళ్లి అతని బట్టలు మార్చుకుని తరువాత తుమకూరు వెళ్లాడని అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. తుమకూరు నుంచి బళ్లారి చేరుకున్న నిందితుడు అక్కడి నుంచి మంత్రాలయం వైపు వెలుతున్న బస్సులో ప్రయాణించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటికే బెంగళూరు, తుమకూరు, బళ్లారిలోని బస్ స్టాండ్ లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన అధికారులు నిందితుడు ఫోటోలను సేకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+