వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో 18 చోట్ల ఎన్ఐఏ దాడులు; ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసు, జమ్మూ కాశ్మీర్ పౌరుల హత్యల కేసులపై ఫోకస్!!

|
Google Oneindia TeluguNews

రెండు అత్యున్నత కేసుల దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జమ్ము & కశ్మీర్, ఢిల్లీ మరియు ఉత్తర ప్రదేశ్ లోని 21 ప్రదేశాలలో దాడులను నిర్వహిస్తోంది. ఒకపక్క సాధారణ పౌరులను హత మారుస్తున్న ఉగ్రదాడులపై ఫోకస్ చేస్తున్న ఎన్ఐఏ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న అండర్ గ్రౌండ్ వర్కర్స్ పై దృష్టి సారిస్తుంది. మరోవైపు మన దేశంలోకి దిగుమతి అయిన డ్రగ్స్ కేసులో వివిధ ప్రాంతాలలో దర్యాప్తును కొనసాగిస్తోంది.

డ్రగ్స్ గుజరాత్ లో దొరికాయని ప్రధాని మోడీకి లింక్ పెడతారా? జగన్ కు డ్రగ్స్ అంటగట్టటంపై హోం మంత్రి సీరియస్!!డ్రగ్స్ గుజరాత్ లో దొరికాయని ప్రధాని మోడీకి లింక్ పెడతారా? జగన్ కు డ్రగ్స్ అంటగట్టటంపై హోం మంత్రి సీరియస్!!

జమ్మూ, కాశ్మీర్ లో 16 చోట్ల, యూపీ, ఢిల్లీ, ఏపీలలో పలు చోట్ల ఎన్ఐఏ దాడులు

జమ్మూ, కాశ్మీర్ లో 16 చోట్ల, యూపీ, ఢిల్లీ, ఏపీలలో పలు చోట్ల ఎన్ఐఏ దాడులు

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జమ్మూ కాశ్మీర్‌లో శ్రీనగర్‌లో ఇటీవల జరిగిన సాధారణ పౌరుల హత్యల తరువాత అనుమానిత ఉగ్రవాద మద్దతు నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని జమ్మూ కాశ్మీర్‌లోని 16 ప్రాంతాలపై దాడి చేసింది. గత నెలలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టు నుండి 3,000 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి ఢిల్లీ మరియు ఉత్తర ప్రదేశ్‌లోని ఐదు ప్రదేశాలలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసిం

ఉగ్రవాదంపై విరుచుకుపడిన ఎన్ఐఏ .. కొనసాగుతున్న దాడులు

ఉగ్రవాదంపై విరుచుకుపడిన ఎన్ఐఏ .. కొనసాగుతున్న దాడులు

లష్కరే తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ మరియు అల్-బదర్ వంటి ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నవారిపై జమ్మూ కాశ్మీర్ లో దాడులు నిర్వహిస్తున్నట్టు, ఈ దాడులు పెద్ద అణిచివేతలో భాగమని ఏజెన్సీ తెలిపింది. జమ్మూ కాశ్మీర్ మరియు ఇతర ప్రధాన నగరాల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా యొక్క కార్యకర్తలచే హింసాత్మక ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కుట్రకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద కుట్ర కేసు (RC 29/2021/NIA/DLI) కు సంబంధించి ఎన్ఐఏ కాశ్మీర్ లోయలోని 16 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.

 సామాన్యులను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాద సంస్థల అనుబంధ సంస్థలపై ఫోకస్ .. ఇద్దరి అరెస్ట్

సామాన్యులను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాద సంస్థల అనుబంధ సంస్థలపై ఫోకస్ .. ఇద్దరి అరెస్ట్

జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల సామాన్యులను టార్గెట్ చేస్తున్న క్రమంలో లష్కర్-ఈ-తైబా (లెట్), జైష్-ఏ-మహమ్మద్ (జెఎమ్), హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ (హెచ్‌ఎం), మరియు వారి అనుబంధ సంస్థలు అల్ బదర్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్), పీపుల్ ఎగైనెస్ట్ ఫాసిస్ట్ ఫోర్సెస్ (పిఎఎఫ్‌ఎఫ్), ముజాహిదీన్ గజ్వతుల్ హింద్ మొదలైన సంస్థలపై దాడులు చేస్తున్నట్టు ప్రకటన పేర్కొంది. ప్రస్తుత దర్యాప్తు ఉగ్రవాదులకు సపోర్ట్ అందించే వారిని లక్ష్యంగా చేసుకుంది. ఇక్కడ గ్రౌండ్ వర్కర్లపై విచారణ జరుగుతోంది అని ఒక ఎన్ఐఏ అధికారి చెప్పారు. కాశ్మీర్‌లోని కుల్గాం, శ్రీనగర్ మరియు బారాముల్లా జిల్లాలలో అనేక చోట్ల దాడులు జరిపిన తరువాత, ది రెసిస్టెంట్ ఫ్రంట్ యొక్క ఇద్దరు అనుమానిత కార్యకర్తలను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్టు చేసింది.

డ్రగ్స్‌పై యుద్ధం .. ఎన్ఐఏ దాడులు

డ్రగ్స్‌పై యుద్ధం .. ఎన్ఐఏ దాడులు

అక్టోబర్ 6 న ముంద్రా పోర్ట్ డ్రగ్ సీజ్ కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత ఎన్ఐఏ నిర్వహించిన రెండో విడత శోధనలు మంగళవారం ఢిల్లీ మరియు ఉత్తర ప్రదేశ్‌లో జరిగాయి. ఈ కేసులో విజయవాడకు చెందిన ట్రేడింగ్ కంపెనీని కలిగి ఉన్న జంటతో సహా ఎనిమిది మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఎన్ఐఏ విచారణ కొనసాగిస్తుంది. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుండి ముంద్రా ఓడరేవుకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ నుండి 2,988.21 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న కేసులో విజయవాడ అడ్రస్ తో టాల్కం పౌడర్ ముసుగులో సాగిస్తున్న డ్రగ్స్ దందా గుట్టు ఛేదించే పనిలో ఉంది ఎన్ఐఏ.

Recommended Video

Sushant Singh Rajput : సుశాంత్ సూసైడ్ కేసు లో రియాను అరెస్ట్ చేయాలి.. NIA దర్యాప్తుకు డిమాండ్!
 భారీ హెరాయిన్ కేసుపై ఎన్ఐఏ సోదాలు .. చెన్నై, ఏపీ, ఢిల్లీలలో కీలక దర్యాప్తు

భారీ హెరాయిన్ కేసుపై ఎన్ఐఏ సోదాలు .. చెన్నై, ఏపీ, ఢిల్లీలలో కీలక దర్యాప్తు

భారతదేశం అంతటా డ్రగ్స్ పంపిణీ చేయడానికి ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తకు సరుకు పంపడానికి ఈ హెరాయిన్ దిగుమతి అయ్యిందని అనుమానాలున్నాయి. ఈ క్రమంలో శనివారం, ఎన్ఐఏ చెన్నై, కోయంబత్తూర్ మరియు విజయవాడలో, ఢిల్లీ, యూపీలలో ఈ డ్రగ్స్ కేసులో నిందితుల ప్రాంగణంలో సోదాలు నిర్వహించింది. సోదాల సమయంలో, డ్రగ్స్ దందాకు సంబంధించిన వివిధ కీలక పత్రాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారి తెలిపారు.

English summary
The NIA has attacked 16 areas in Jammu and Kashmir, targeting terrorist support networks in connection with the killing of civilians. The NIA has raided five locations in Delhi and UP in connection with the seizure of 3,000 kg of heroin from the Mundra port.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X