మహిళలను కించపరుస్తారా?: నిర్భయ డిఫెన్స్ లాయర్లకు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: నిర్భయ ఘటనపై న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తున్న డిఫెన్స్ న్యాయవాదులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిర్భయ ఉదంతంపై ఇంగ్లీష్ ఫిల్మ్ మేకర్ రూపొందించిన ‘ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీలో డిఫెన్స్ లాయర్లు మహిళలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ) నోటీసులు జారీ చేసింది.
డాక్యుమెంటరీలో డిఫెన్స్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, ఏపి సింగ్‌లు చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని బార్ కౌన్సిల్ పేర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయవాదులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని బిసిఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు.

కాగా, నిర్భయ కేసులో దోషుల తరపున వాదించిన ఎంఎల్ శర్మ, ఏపి సింగ్‌లు.. మహిళలను కుక్కలతోపాటు పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. దీనిపై మహిళా సంఘాలు, న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఆ లాయర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బార్ కౌన్సిల్‌ను కోరిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications