Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..!
ఇరాన్ వార్ కారణంగా తలెత్తుతున్న పరిస్ధితులు భారత్ ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొరత లేదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం చెబుతున్నా.. క్షేత్రస్ధాయిలో మాత్రం జనం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి కారణం వారిలో ఉన్న భయాలే అని సర్దిచెప్పేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న తరుణంలో తాజాగా ప్రధాని మోడీ.. పార్లమెంట్ ఉభయసభల్లో ఇరాన్ వార్ తో ఇబ్బందులు తప్పవని, సిద్ధంగా ఉండాలని తేల్చిచెప్పేశారు.
దీంతో కోవిడ్ తరహాలో లాక్ డౌన్ (lockdown) విధిస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనిపై ఇవాళ ఉదయం పెట్రోలియం మంత్రి క్లారిటీ ఇచ్చినా జనంలో మాత్రం భయాలు వీడలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) దీనిపై క్లారిటీ ఇచ్చారు. భారతదేశంలో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందన్న వదంతులను నిర్మల కొట్టిపారేశారు. ఆ వదంతులు "నిరాధారమైనవి" అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, ప్రజలు భయాన్ని వ్యాప్తి చేయవద్దని కోరారు.

రాజ్యసభలో ఆర్ధిక బిల్లు, 2026పై జరిగిన చర్చ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ.. నిరాధారమైన వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, ప్రజల మనసుల్లో భయాన్ని సృష్టించడం కోసమే ఏది పడితే అది చెబుతున్నారన్నారు. ఈ లాక్‌డౌన్ ఎక్కడ జరుగుతోంది? ఇది పాకిస్థాన్‌లో జరుగుతోంది, భారతదేశంలో కాదు" అని అన్నారు. పొరుగు దేశాలతో పరిస్థితిని పోలుస్తూ, భారతదేశం తన వనరులను, పౌరుల అవసరాలను జాగ్రత్తగా నిర్వహిస్తూనే ఉందన్నారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితిని చూడండి, వారు కష్టాల్లో ఉన్నారని లేదా బాధపడుతున్నారని చెప్పడానికి తాను ఈ మాట అనడం లేదని, కేవలం వాస్తవ పోలిక కోసమే ప్రస్తావిస్తున్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications