Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..!
ఇరాన్ వార్ వేళ దేశంలో ఎక్కడికక్కడ చమురు (fuel) కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా పెట్రోల్ (petrol) బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అన్నింటికీ సిద్దంగా ఉండాలంటూ ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం పార్లమెంట్ లో చేసిన ప్రకటన తర్వాత జనం బంకులకు వెళ్లి పెట్రోల్, డీజిల్ ను స్టాక్ పెట్టుకోవడం ప్రారంభించారు. దీంతో స్టాక్ లు లేకుండా పోయాయి. వీటిని రప్పించేందుకు బంకులు ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం చమురు స్టాక్ పై క్లారిటీ ఇచ్చింది.
భారతదేశంలో ప్రస్తుతం దాదాపు రెండు నెలలకు సరిపడా చమురు, ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. చమురు కొరత వదంతులపై ఆందోళన చెందవద్దని ప్రజల్ని కోరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ఇంధన పరిస్థితి స్థిరంగా, పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వల్ని స్టాక్ పెట్టుకున్నట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దిగుమతులను ముందుగానే ప్లాన్ చేసుకున్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది.

India’s energy supply is fully secure and stable.
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) March 26, 2026
There is NO shortage of petrol, diesel, or LPG anywhere in the country. All retail outlets are operating normally, with adequate supplies.
Misinformation and panic-driven narratives are completely unfounded. Citizens are advised…
హార్ముజ్ జలసంధి వద్ద సమస్యలున్నా భారత్ 40కి పైగా దేశాల చమురు సరఫరాదారుల నుండి ముడి చమురును సేకరిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలు 100 శాతానికి పైగా సామర్థ్యంతో నడుస్తూ, ఇంధన సరఫరాను స్థిరంగా ఉంచుతున్నాయి. దీంతో మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులకు సరిపోగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాస్తవ నిల్వ సుమారు 60 రోజులకు సరిపోతుందని తెలిపింది. ఇందులో ముడి చమురు, శుద్ధి చేసిన ఉత్పత్తులు, భూగర్భ గుహలలో నిల్వ ఉన్న వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా ఎల్‌పిజి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని ఇంధన కేంద్రాలు సాధారణంగా పనిచేస్తున్నాయి మరియు ఎటువంటి రేషనింగ్ అమలులో లేదని వెల్లడించింది.
-
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
వాహనదారులకు భారీ ఉపశమనం? -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!













Click it and Unblock the Notifications