Union Budget 2024: వరుసగా ఏడోసారి నిర్మలమ్మ బడ్జెట్-హైలెట్స్ ఇవే..!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ వరుసగా ఏడోసారి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్ సభలో ఉదయం 11 గంటల తర్వాత నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది. అంతకు ముందే కేంద్ర కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. దీంతో నిర్మల లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడంపై అభినందనలు తెలుపుతూ ఆర్ధిక మంత్రి తన ప్రసంగం ప్రారంభించారు.

48.02 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో మొత్తం ఆదాయం 32.047 లక్షల కోట్లుగా తెలిపారు. పన్ను ఆదాయం 28.08 లక్షల కోట్లు. అప్పులు, పన్నేతర ఆదాయం 16 లక్షల కోట్లుగా అంచనా వేశారు. అలాగే ద్రవ్యోల్బణం 4.9 శాతంగా లెక్కించారు.
అంతర్జాతీయంగా ఉన్న అస్థిర పరిస్ధితుల ప్రభావం భారత్ లోనూ ద్రవ్యోల్బణానికి కారణమవుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పేదలు, మహిళలు, యువత రైతులే లక్ష్యంగా ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు నిర్మల తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో ఐదేళ్లకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. దీంతో 80 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందన్నారు. ఈసారి 9 రంగాలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామన్నారు.
ఐదు పథకాల ప్రధానమంత్రి ప్యాకేజీని నిర్మల వెల్లడించారు. ఇది 2 లక్షల కోట్లతో వచ్చే ఐదేళ్లలో ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు. 1.48 లక్షల కోట్లతో విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన చేపడతామన్నారు. వికసిత్ భారత్ లక్ష సాధనలో భాగంగా ఈసారి 9 రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఇందులో మొదటిది వ్యవసాయంలో ఉత్పాదకత, విద్య, నైపుణ్యాల కల్పన, సమ్మిళిత మానవ వనరుల అభిృద్ధి-సామాజిక న్యాయం, తయారీ-సేవలు, పట్టణాభివృద్ధి, శక్తి భద్రత, సృజనాత్మకత, భవిష్యత్ సంస్కరణలు ఉన్నాయన్నారు.
ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఎన్డీయేకు కీలకమైన భాగస్వాములు టీడీపీ, జేడీయూలను సంతృప్తి పర్చే లక్ష్యంతో ఏపీ, బీహార్ కు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఇందులో ఏపీకి అమరావతి రాజధాని కోసం రూ.15 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పోలవరం త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అటు బీహార్ లో రోడ్ల కోసం రూ.26 వేల కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. బీహార్ లో కొత్త ఎయిర్ పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా సదుపాయాల కోసం రాబోయే సంవత్సరాల్లో రూ.15 వేల కోట్లు ఇస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ఆర్ధిక మంత్రి ప్రత్యేక ప్రకటన చేశారు. ఇందులో కొత్త ఎంఎస్ఎంఈ గ్యారంటీ ప్లాన్ కింద రూ.100 కోట్ల వరకూ రుణాలు ఇస్తామన్నారు. ఎస్ఎంఏ దశలో ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈలకు బ్యాంక్ క్రెడిట్ లను సులభతరం చేసేందుకు ఈ కొత్త విధానం అమలు చేస్తామన్నారు. ముద్రా రుణాల పరిమితి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టారు.
ఉద్యోగాల్లో చేరే కొత్త ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఒక నెల వేతనాన్ని ఇచ్చే మరో పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్‌గా అందజేస్తారు.ఈ పథకం అన్ని రంగాలలో ఉన్న సంస్థల్లో ఉద్యోగాల్లో చేరే వారికి వర్తించనుంది. దీంతో 210 లక్షల మంది యువతకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
ప్రధానమంత్రి అర్బన్ హౌసింగ్ ప్లాన్ కోసం 10 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే కోటి ఇళ్లకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రకటించారు. స్టాంప్ డ్యూటీలను తగ్గించేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని సీతారామన్ చెప్పారు. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు వరద సహాయాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు.
కొత్త పన్ను విధానంలో ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. అలాగే కొత్త పన్ను విధానంలో స్లాబ్ లు కూడా మార్చారు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకూ ఆదాయం ఉంటే 5 శాతం పన్ను, 7 లక్షల నుంచి 10 లక్షలు ఉంటే 10 శాతం, 10 లక్షల నుంచి 15 లక్షలు ఉంటే 15 శాతం పన్ను విధిస్తారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను పరిమితి 2.5 లక్షలకు పెంచారు.
ఎన్పీఎస్ వాత్సల్యగా పిలువబడే మైనర్‌ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని బడ్జెట్లో ఆర్థికమంత్రి ప్రకటించారు. పిల్లలు పెద్దయ్యాక అంటే 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ ప్లాన్ సాధారణ ఎన్పీఎస్ కు మారుస్తారు. దీంతో తల్లిదండ్రులు ఇప్పుడే తమ పిల్లలకు పెన్షన్లను ప్లాన్ చేసుకోవచ్చు. తాజా వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి వీలవుతుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications