పెట్రోల్ లో ఇథనాల్ కలిపితే మైలేజ్ తగ్గుతుందా..? గడ్కరీ ఛాలెంజ్..
ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల సమస్యలు వచ్చిన వాహనాన్ని ఒక్కటైనా చూపించాలని సవాల్ చేశారు. తాజాగా బిజినెస్ టుడే నిర్వహించిన సదస్సులో పాల్గొన్న నితిన్ గడ్కరీ.. ఈ సందర్భంగా ఇథనాల్ పెట్రోల్ పై కీలక విషయాలు వెల్లడించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక టాపిక్ మీద చర్చ నడుస్తోంది. పెట్రోల్ లో ఇథనాల్ కలిపితే వాహనాల మైలేజ్ తగ్గుతుందని గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ పోయడం వల్ల వాహనాల మైలేజీ తగ్గిపోవడమే కాక వాహనాల్లో ఇతర సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే అవన్నీ అవాస్తవమేనని ఇటీవల కేంద్రం దీనిపై స్పష్టత నిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తాజాగా కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇదే విషయంపై స్పందిస్తూ.. ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇథనాల్‌తో మైలేజీ సమస్య వచ్చిన ఒక్క వాహనాన్ని చూపించాలని అన్నారు.

పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను కలిపితే వాహనాల మైలేజీ తగ్గుతోందన్న వాదన ఏ రకంగానూ సరైంది కాదని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అనవసర చర్చలు వృథా అని తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారాలను కావాలనే కొన్ని పెట్రోలియం కంపెనీలు చేస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రపంచంలో ఎక్కడైనా ఇథనాల్ బ్లెండెడ్ ఈ- 20 పెట్రోల్ కారణంగా సమస్య వచ్చినట్లు ఒక్క వాహనాన్ని అయినా చూపించండని సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications