బీహార్‌లోనూ ఎన్డీఏ సర్కారు: ఆరోసారి సీఎంగా నితీష్ ప్రమాణం
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గురువారం ఉదయం ఆరోసారి ప్రమాణం స్వీకారం చేశారు. బుధవారం అనూహ్యంగా రాజీనామా చేసిన నితీష్.. 24గంటలలోపే తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధించడం గమనార్హం.
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గురువారం ఉదయం ఆరోసారి ప్రమాణం స్వీకారం చేశారు. బుధవారం అనూహ్యంగా రాజీనామా చేసిన నితీష్.. 24గంటలలోపే తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధించడం గమనార్హం.
రాష్ట్ర గవర్నర్ త్రిపాఠి గురువారం ఉదయం 10గంటలకు నితీష్ కుమార్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉపముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోడీ కూడా ప్రమాణం చేశారు. కాగా, శుక్రవారం నితీష్ కొత్త ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కోనుంది. మిగితా మంత్రులు ఆ తర్వాత ప్రమాణం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాగా, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్విని ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని నితీష్ ప్రయత్నించారు. అయితే, తేజస్వి మాత్రం తాను రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు.
లాలూ కూడా తేజస్వి మంత్రివర్గం నుంచి తప్పుకోడంటూ, అసలు నితీష్‌ను ముఖ్యమంత్రిని చేసింది తానేనని లాలూ చెప్పుకొచ్చారు. అంతేగాక, నితీష్‌పై హత్యానేరారోపణలు చేశారు లాలూ. దీంతో ఆర్జేడీతో నితీష్ తెగదెంపులు చేసుకున్నారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేశఆరు.
బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. బీహార్‌లో జేడీయూతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ కూడా సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే బీహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మూడేళ్ల తర్వాత నితీష్ ఎన్డీఏలో చేరడం గమనార్హం.












Click it and Unblock the Notifications