Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రస్తుతానికి కుర్చీ ఖాళీ లేదు.. ఐదేళ్లు నేనే సీఎం: సిద్ధరామయ్య

Karnataka CM Siddaramaiah: కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠంపై మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలపై సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఆ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ సీఎం పదవి ఆశిస్తున్న మాట వాస్తవమేనని.. కానీ నాయకత్వ మార్పు ఉండదని వ్యాఖ్యానించారు. 2028 ఎన్నికల వరకు తానే సీఎంగా ఉంటానన్నారు. తనను సీఎం పదవి నుంచి హైకమాండ్ తొలగిస్తుందనే వార్తలు అవాస్తవమన్నారు. తనను పదవి నుంచి దిగిపోవాలని లేదా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మార్గం సుగమం చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోరిందనే వార్తల్లో నిజం లేదన్నారు.

"నేను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాను. నేను ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాను. నేను జూలై 2న కూడా ఈ ప్రకటన చేశాను. ఆ రోజు డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారు. నేను ఒక సంవత్సరం తర్వాత కూడా అదే కుర్చీలో ఉంటాను. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఆశావహుడే. కానీ ఇప్పుడు కుర్చీ ఖాళీ లేదు." అని సిద్ధరామయ్య ఇప్పటివరకు వచ్చిన పుకార్లను కొట్టిపడేశారు.

No Change in CM Post Siddaramaiah Confirms He ll Continue for 5 Years

నాయకత్వ మార్పిడికి అధిష్టానం అంతర్గత సూచనలు లేదా కాలపరిమితులు నిర్ణయించిందనే వాదనలను సిద్ధరామయ్య తిరస్కరించారు. రెండున్నర సంవత్సరాలు ఎప్పుడూ నిర్ణయించబడలేదన్నారు. అది సరికాదని.. అధిష్టానం మాకు చెప్పిందేమిటంటే.. ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని మాత్రమే చెప్పిందిన్నారు. అధిష్టానం ఆదేశాలను పాటించాలని సూచించిందని స్పష్టం చేశారు. మాది అధిష్టానం పార్టీ అని మల్లికార్జున్ ఖర్గే ఇప్పటికే చెప్పారని ఆయన వెల్లడించారు. తనతో పాటు డీకే శివకుమార్ కూడా అది పాటిస్తారన్నారు.

ఇక పార్టీ నాయకత్వంపై కాంగ్రెస్‌ రణ్‌దీప్‌ సుర్జేవాలా ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తలేదన్నారు. డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొద్దిమంది ఎమ్మెల్యేలు ఉన్నారని అంగీకరించారు. తాను నేడు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ కోరానని అయితే ఇప్పటివరకు దానిపై ఎలాంటి కన్ఫర్‌మేషన్‌ లేదని చెప్పారు. రణదీప్ సుర్జేవాలా వంటి కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో నాయకత్వం గురించి ప్రశ్నలు లేవనెత్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సుర్జేవాలా ఎటువంటి ప్రశ్న అడగలేదని సిద్ధరామయ్య అన్నారు. డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే కొందరు ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఉంటారని, కానీ ఎక్కువ మంది కాదన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంది: ముఖ్యమంత్రి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పటిష్టంగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. డబ్బు కొరత లేదని సీఎం స్పష్టంగా చెప్పారు. మా వద్ద తగినంత డబ్బు ఉందన్నారు. ఒకటి లేదా రెండు కేసులో ఉండవచ్చని.. కానీ దాని అర్థం ప్రభుత్వం దివాళా తీసిందని కాదన్నారు. మూడేళ్ల సమర్థవంతమైన పాలనను ఉటంకిస్తూ, ఆర్థిక దుర్వినియోగం అనే కథనాన్ని ఆయన ప్రశ్నించారు. "ప్రభుత్వం దివాలా తీస్తే మా హామీలను అమలు చేయడం ఎలా సాధ్యమవుతుంది?" అని ఆయన అడిగారు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగిస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు. కేంద్రం కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు.

తొక్కిసలాట మరణాలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం
జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటపై ప్రశ్నలకు సిద్ధరామయ్య సమాధానమిచ్చారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ, "రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ) విధాన్ సౌధా సమీపంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నన్ను కోరారు, నేను అనుమతించాను." అని సీఎం చెప్పారు ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారా అని అడిగినప్పుడు.. సిద్ధరామయ్య స్పందిస్తూ, "ఖచ్చితంగా, 11 మంది మరణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటు ఉంది, కానీ ప్రభుత్వ వైఫల్యం లేదు. ఈ కార్యక్రమానికి పోలీసులు సరైన బందోబస్తు కల్పించి ఉండాలి" అని అన్నారు "నేను సాయంత్రం 4:15 గంటలకు కార్యక్రమానికి వెళ్ళాను, ఎందుకంటే అంతకు ముందే తొక్కిసలాట జరిగింది. పోలీసులు నాకు అస్సలు తెలియజేయలేదు, నాకు తెలియదు." ఈ కారణంగానే సంబంధిత ఉన్నతాధికారులను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు.

బీజేపీ 60శాతం అవినీతి ఆరోపణ కేవలం రాజకీయ నాటకం
కాంగ్రెస్ ప్రభుత్వం 60 శాతం అవినీతికి పాల్పడుతోందని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ఇప్పుడు ఆరోపిస్తోందని బీజేపీ విమర్శలపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దానిని రాజకీయ ప్రకటనగా కొట్టిపారేశారు. "ఇది బీజేపీ చేసిన రాజకీయ ప్రకటన. బీజేపీ 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని నడిపిందని మేము ఆరోపించాము. ఇది మేము లేవనెత్తిన నినాదం కాదు - కాంట్రాక్టర్ల సంఘం ఆ ఆరోపణలు చేసింది. సంఘం అధ్యక్షుడు అయిన ఒక కెంపన్న ఈ విషయం చెప్పారు" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై సంఘం ఇదే విధమైన ఆరోపణలు చేసిందనే వాదనను ముఖ్యమంత్రి గట్టిగా ఖండించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+