Budget 2022-23 : శ్లాబుల్లో నో ఛేంజ్.. వేతన జీవులకు బడ్జెట్‌లో నిరాశ ..
2022-23 కేంద్ర బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వేతన జీవులకు నిరాశ ఎదురైంది. ఈ సారి కూడా ఆదాయపన్ను మినహాయింపులపై ఉద్యోగస్తులకు ఊరట కల్పించే ఏ నిర్ణయాన్ని కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. దీంతో ఎన్నో ఆశలతో ఉన్న సగటు ఉద్యోగికి నిరాశనే ఈ బడ్జెట్ మిల్చింది. ఐటీ రిటర్న్‌ల దాఖలులో వెసులుబాటును మాత్రం కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఆదాయపన్ను చెల్లింపులో సవరణలు
దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులు కేంద్రం ఇవ్వలేదు. 2022-23కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు సమర్పించారు. సగటు ఉద్యోగికి ఊరట కల్పించే వార్తలేవి లేనప్పటికీ.. ఆదాయపన్ను చెల్లింపులో సవరణలు చేసింది. ఆదాయ పన్ను చెల్లించిన తర్వాత రెండేళ్లలోపు అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు అందిస్తునట్లు ప్రకటించారు. రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండు సంవత్సరాలలో సవరణలు చేసుకోవచ్చవని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ ఉంటుందని నిర్మలా సీతారామన్ లోక్ సభలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పీఎస్ మినహాయింపును పెంచింది. దీనిని 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
Recommended Video

ఉద్యోగ కల్పనకు పెద్దపీట
దేశంలో ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దాదాపు 60 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పీఎం గతి శక్తి దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లుందన్నారు. తద్వారా యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. ఈ బడ్జెట్ ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ప్రధాన మంత్రి గతి శక్తి మిషన్, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పాదకత పెంపు, ఆర్థిక పెట్టుబడులపై కేంద్రం కృషిచేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications