జీఎస్టీ పరిహారంపై కుదరని ఏకాభిప్రాయం.. వారంలో రెండోసారి..
రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారం మరోసారి ఏకాభిప్రాయం కుదరలేదు. తెలంగాణ సహా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు జీఎస్టీ పరిహారం ఇవ్వాలని కోరుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారంలో రెండోసారి సోమవారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్ అధ్యక్షతన జరిగింది. మొత్తంగా మూడోసారి సమావేశం జరిగింది. కానీ సమావేశంలో ఏకాభిప్రాయం రాలేదని తర్వాత నిర్మలా మీడియాకు తెలిపారు.
సమావేశంలో రాష్ట్రాల ఆర్థికమంత్రులు పాల్గొని.. పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం తమకు వెంటనే పరిహారం కావాలని అడిగాయి. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం ఆచి తూచి స్పందించాయి. జీఎస్టీ పరిహారం ఇవ్వాలని పంజాబ్ మరోసారి కోరింది. కానీ రుణం తీసుకోవాలని అడగడం సరికాదని మరోసారి పంజాబ్ ఆర్థికమంత్రి మన్ ప్రీత్ బాదల్ అన్నారు.

అయితే కేంద్రం మాత్రం రుణాలు తీసుకునేందుకు 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే అంగీకరించాయని చెబుతున్నాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు రుణం తీసుకోవాలనే కోరే అధికారం జీఎస్టీ కౌన్సిల్‌కు లేదని రాష్ట్రాలు చెబుతున్నాయి.అంతకుముందు జీఎస్టీ సమావేశంలో రెండు ప్రతిపాదనలు చేశారు. బీహార్ లాంటి రాష్ట్రాలు తమకు తక్షణమే రూ.2 లక్షల కోట్ల పరిహారం ఇవ్వాలని కోరుతున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications