Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుజరాత్ ఎన్నికలు 2017: వంట గ్యాస్ ధరలు పెంచలేదా?

న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకొని డిసెంబర్ మాసంలో ఆయిల్ కంపెనీలు వంట గ్యాస్ ధరలను పెంచలేదు. వరుసగా 17 మాసాల పాటు వంట గ్యాస్ ధరలను పెంచుతూ వచ్చిన ఆయిల్ కంపెనీలు ఈ నెలలో మాత్రం వినియోగదారులపై కరుణ చూపారు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయనే కారణంగా వంట గ్యాస్ ధరలను పెంచుతూ వచ్చారు. అంతేకాదు వంట గ్యాస్ పై సబ్సీడీని ఎత్తివేయాలని కేంద్రం ప్లాన్ చేస్తోందనే ప్రచారం కూడ సాగింది.

ఈ మేరకే వంట గ్యాస్‌ ధరలను పెంచుతూ వస్తోందనే విపక్షాలు కేంద్రంపై ఆరోపణలు గుప్పించాయి. అయితే గుజరాత్ ఎన్నికల కారణంగానే ఈ నెలలో వంట గ్యాస్ ధరలను తగ్గించలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 గుజరాత్ ఎన్నికల వల్లే వంటగ్యాస్ పెంచలేదు

గుజరాత్ ఎన్నికల వల్లే వంటగ్యాస్ పెంచలేదు

గత 17 నెలల్లో ఆయిల్‌ కంపెనీలు వంట గ్యాస్‌ ధరను 19సార్లు పెంచాయి. అప్పటి ధరతో పోలిస్తే ప్రస్తుతం సిలిండర్‌పై రూ.76.5 పెరిగింది. అయితే ఈనెలలో మాత్రం ఆయిల్‌ కంపెనీలు వంటగ్యాస్‌ ధర జోలికి వెళ్లలేదు. గుజరాత్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డిసెంబరులో వంట గ్యాస్‌ ధరను పెంచలేదనే ప్రచారం సాగుతోంది.

 సబ్సీడీని ఎత్తేస్తారా

సబ్సీడీని ఎత్తేస్తారా

వంటగ్యాస్‌పై 2018 నాటికి ప్రభుత్వం సబ్సిడీలను ఎత్తివేసే ఆలోచనలో ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌)లు గతేడాది జులై నుంచి ప్రతీ నెల 1వ తేదీన ధరలను పెంచుతూ వస్తున్నాయి. అయితే ఈ నెలలో మాత్రం ధరను పెంచకుండా వదిలేశాయి.సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌పై ప్రతి నెలా కొద్ది మొత్తంలో ధరను పెంచడం ద్వారా మార్చి 2018 నాటికి సబ్సిడీని ఎత్తివేయాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

వంట గ్యాస్ ధరలో ఈ నెలలో మార్పు లేదు

వంట గ్యాస్ ధరలో ఈ నెలలో మార్పు లేదు

ఈ నెలలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పూ చేయలేదని అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే తాను ఈ నిర్ణయం తీసుకునే స్థానంలో లేనని, ఇది చాలా సాధారణ నిర్ణయమని తెలిపారు. ప్రతి నెల గ్యాస్ ధరలో మార్పులు చేసే అధికారులు మాత్రం ఈ నెలలో మాత్రం స్పందించలేదు.

 ప్రతి సిలిండర్‌కు రూ. 251 చెల్లింపు

ప్రతి సిలిండర్‌కు రూ. 251 చెల్లింపు

నవంబరు 1వ తేదీన సబ్సిడీ ఎల్‌పీజీపై రూ.4.50 పెంచడం ద్వారా రూ.495.69కి చేరింది. ప్రస్తుతం సిలిండర్‌కు రూ.251.31 చొప్పున ప్రభుత్వం ఆయిల్‌ కంపెనీలకు చెల్లిస్తోంది.. దీంతో జూన్‌ 2016లో రూ.419.18గా ఉన్న వంటగ్యాస్‌ ధర గతనెల వరకు రూ.76.51 పెర‌గ‌డం ద్వారా రూ.495.69కి చేరింది. గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి వ్యక్తి సంవత్సరానికి 12 గ్యాస్‌ సిలిండర్లను సబ్సిడీ కింద పొందవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+