వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త: నెలనెలా ధరల పెంపు రద్దు!

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త అందించింది. గ్యాస్ సిలిండర్ ధరలను నెలనెలా పంచే పద్ధతికి స్వస్తి చెప్పినట్టు ప్రకటించింది. ప్రతీ నెలా రాయితీ వంటగ్యాస్ సిలిండర్‌పై నాలుగు రూపాయలు పెంచుతూ పోతున్నాయి చమురు సంస్థలు.

  Today's Top Trending News

  అంతేగాక, వచ్చే ఏడాది నాటికి రాయితీని పూర్తిగా ఎత్తివేయాలని యోచిస్తున్నాయి.
  దీంతో గ్యాస్ సిలిండర్‌కు నెలకో ధర ఉండటంతో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

   ధరలు పెంచొద్దు

  ధరలు పెంచొద్దు

  ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇకపై ప్రతినెల గ్యాస్ ధరను పెంచే పద్ధతిని విరమించుకోవాలని చమురు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

   రూ.2 నుంచి రూ.4కు

  రూ.2 నుంచి రూ.4కు

  గత సంవత్సరం జులైలో చమురు కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ సిలిండర్‌పై ప్రతీ నెల రెండు రూపాయలు పెంచాలని పేర్కొంది. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో రూ.2లను ఈ ఏడాది మేలో రూ.4 చేశారు. జూన్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది.

   సబ్సీడీని ఎత్తేయాలని..

  సబ్సీడీని ఎత్తేయాలని..

  ఫలితంగా వచ్చే ఏడాది మార్చి నాటికి వంట గ్యాస్‌పై అందిస్తున్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయవచ్చని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతుండటం, పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిపెంచడంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతోంది.

   ధరల పెంచొద్దని ఆదేశాలు

  ధరల పెంచొద్దని ఆదేశాలు

  అంతేగాక, గ్యాస్ ధరల పెంపుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇకపై నెలనెలా గ్యాస్ ధరలు పెంచవద్దని చమురు సంస్థలకు ఆదేశించింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  No more monthly hike of Rs. 4 in cylinder prices.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి