వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసారి కరోనాకు భయపడుతన్నారా ? మీకో గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్ శాస్త్రవేత్త

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా భయాలు పెరుగుతున్నాయి. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని నిన్న ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీలో ప్రధాని మోడీ హెచ్చరించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వాలు మళ్లీ అప్రమత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ లో ఓ అత్యున్నత స్దాయి శాస్త్రవేత్త ఈసారి కోవిడ్ ముప్పుపై ఊరటనిచ్చే న్యూస్ చెప్పారు.

కోవిడ్ పై పోరులో భారత్ ఎంతో మెరుగ్గా ఉందని, ఐదో, ఆరో వేవ్ లతో ఇబ్బందులు పడుతున్న హాంకాంగ్, కెనడా వంటి ఇతర దేశాల మాదిరిగా కాకుండా పరిస్ధితుల్ని పూర్తిగా నియంత్రణలో ఉంచుకుందని ఐసీఎంఆర్ వైరాలజీ హెడ్ డాక్టర్ నివేదిత గుప్తా న్యూస్ 18తో చెప్పారు. సెకండ్ వేవ్ లో తప్ప భారత్ ఎంతో మెరుగ్గా పనిచేసిందని ఆమె తెలిపారు. కాకపోతే ఇప్పటి వరకు కోవిడ్ వేవ్ లను అదుపు చేయగలిగామని ఆమె వెల్లడించారు. ఇతర దేశాల్లో పలు వేవ్ లు రావడానికి కారణం లాక్‌డౌన్లలో వారు అనుసరించిన విధానాలే కారణమని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త తెలిపారు. జీరో కోవిడ్ విధానాన్ని పాటించిన దేశాలు వెంటనే కేసుల పెరుగుదలను చూశాయన్నారు.

No Need to Panic on latest covid 19 surge, says top icmr scientist

ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో ఉపయోగించే టీకాలు, ముఖ్యంగా కోవిషీల్డ్, కోవాక్సిన్ వంటివి భారత్ పనితీరుకు కారణం కావచ్చని డాక్టర్ గుప్తా వెల్లడించారు. పాశ్చాత్య దేశాలలో ఉపయోగించే వ్యాక్సిన్‌ల కంటే భారతదేశంలో ఉపయోగించే వ్యాక్సిన్‌లు మనల్ని రక్షించడానికి ప్రధానన కారణమని నిరూపించడానికి ఎటువంటి డేటా లేనప్పటికీ, ఈ అవకాశాన్ని తోసిపుచ్చడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

భారత్ కనుచూపు మేరలో కొత్త వేరియంట్‌లు లేవని, అలాగే ఓమిక్రాన్ వేరియంట్ యొక్క ఉప-వంశాలు మాత్రమే ఉన్నందున, కోవిడ్ -19 కేసుల తాజా వేవ్ పై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని డాక్టర్ గుప్తా వెల్లడించారు.
మాస్కింగ్, సామాజిక దూరాన్ని పాటించడం, చేతుల పరిశుభ్రత వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనదని మాత్రం గుర్తుచేశారు. అలాగే, బూస్టర్ డోస్‌లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులు, ఇతరత్రాసమస్యలతో బాధపడుతున్న కోవిడ్ రోగులు ఖచ్చితంగా బూస్టర్ షాట్లు తీసుకోవడానికి ముందుకు రావాలని ఆమె కోరారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వం బూస్టర్‌లు ఇస్తోంది కాబట్టి, పెద్దలంతా తమ పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించడంలో చురుగ్గా వ్యవహరించాలన్నారు.

English summary
an icmr scientist has clarified that no need to panic on fresh covid 19 wave with different reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X