కొత్త వెయ్యి రూపాయాల నోటు ఆలోచనే లేదు, తప్పుడు ప్రచారమే, శక్తికాంత్ దాస్ ఇలా..
కొత్త వెయ్యి రూపాయాల నగదు నోటుపై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ కీలకమైన ప్రకటన చేశారు. కొత్త వెయ్యి రూపాయాల నగదు నోటును ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో శక్తిదాస్
న్యూఢిల్లీ:కొత్త వెయ్యి రూపాయాల నోటు విషయమై కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ కీలకమైన ప్రకటన చేశారు. కొత్త వెయ్యి రూపాయాల నోటును ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో శక్తి కాంత్ దాస్ కీలకమైన ప్రకటన చేశారు. ప్రభుత్వానికి కొత్తగా వెయ్యి రూపాయాల నగదు నోటును ప్రవేశపెట్టే ఆలోచన లేదని ఆయన ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వానికి కొత్త వెయ్యి రూపాయాల నగదు నోటును ప్రవేశపెట్టే ఆలోచన లేదని ఆయన తేల్చేశారు. ఇప్పటివరకు అలాంటి ఆలోచనే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఢిల్లీలో ఐఎంఎఫ్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ సెంటర్ ప్రారంబఓత్సవంలో ఆయన కొత్త వెయ్యి రూపాయాల నగదు నోటు ప్రవేశపెట్టే విషయమై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ బి ఐ ముద్రణ కార్యాలయాల్లో కొత్త వెయ్యి రూపాయాల నోట్లను ముద్రిస్తున్నారని ప్రచారం సాగింది. జాతీయ మీడియా కూడ ఈ విషయమై కథనాలను ప్రసారం చేసింది.
దేశంలోని ఎటిఎంలలో నగదు కొరత ఉన్న విషయం తమ దృష్టికి వచ్చిందని, తగిన నగదును అందుబాటులో ఉంచేందుకుగాను అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నట్టు ఆయన చెప్పారు. తమ దృష్టంతా తగినన్ని ఐదువందల రూపాయాల నోట్లను అందుబాటులోకి తీసుకు రావడంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications