వెయ్యి నోట్లు ఇక ఇప్పట్లో రావు.. : ఆ ఆలోచన లేదన్న అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ : దేశంలో నోట్ల రద్దు అంశంపై హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2వేల నోట్లతో పాటు రద్దు చేసిన పాత వెయ్యి నోటును కూడా తిరిగి కొత్త ఫీచర్లు తీసుకొస్తానని చెప్పిన కేంద్రం.. ప్రస్తుతం ఆ ఆలోచన లేదని తేల్చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని ప్రకటించారు.
దేశంలో ఉన్న మొత్తం 2లక్షల ఏటీఎం మిషన్లలో దాదాపు 22,500 మిషన్లను.. వంద నోట్లతో పాటు రూ.2వేల కొత్త నోటును విత్ డ్రా చేసుకోవడానికి అనుగుణంగా రూపొందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి వాటి నుంచి రూ.100, రూ.500, రూ.2000 మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశముందన్నారు.

ఇకపోతే బ్యాంకుల్లో నగదు మార్పిడిని రూ.4500నుంచి రూ.2000కే పరిమితం చేయడంపై మీడియా ప్రశ్నించగా.. అందుబాటులో ఉన్న నిధులను దుర్వినియోగం చేయవద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. సామాన్యుల పెళ్లిళ్ల కోసం రూ.2.5లక్షలను విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించినట్టుగా తెలియజేశారు.












Click it and Unblock the Notifications