వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ లేని మోడీ ప్రసంగం.. అమిత్ షా ప్రసంగాన్ని రిపీట్ చేసిన ప్రధాని

|
Google Oneindia TeluguNews

Recommended Video

కశ్మీర్‌కు ప్రత్యేక ప్యాకేజీ లేని మోడీ ప్రసంగం.. !!

కశ్మీర్ పరిణామాలపై ప్రధాని మోడి ప్రసంగాన్ని యావత్తు దేశం ఉత్కంఠతతో ఎదురు చూసింది. కశ్మీర్‌కు ప్రత్యేకంగా ఎదో చేయబోతున్నారనే అంతా భావించారు. స్థానిక ప్రజల వ్యతిరేకతను చల్లార్చేందుకు మోడీ కీలక ప్రకటన చేయబోతున్నారని ఊహించారు. అయితే ప్రజలు భావించినట్టు మోడీ ఎలాంటీ ప్యాకేజీలు లేవు. ముఖ్యంగా మోడీ తన ప్రసంగంలో కశ్మీర్ అభివృద్ది,భవిష్యత్ పరిణామాలపైనే ఎక్కువగా దృష్టి సారించారు.

మోడీ ప్రసంగంపై ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలు

మోడీ ప్రసంగంపై ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలు

కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తితోపాటు ఆరాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంతో, ప్రపంచ దేశాలతో పాటు భారత దేశం ప్రజల దృష్టి మొత్తం ప్రధాని మోడీ కశ్మీర్‌ అభివృద్దికి ఎలాంటీ నిర్ణయాలు తీసుకోబుతున్నారనే ఉత్కంఠ నెలకోంది. ఇందుకు అనుగుణంగానే ప్రత్యేకంగా కశ్మీర్ పరిణామాలపై మోడీ ప్రసంగాన్ని వినేందుకు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూశారు.

పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగాన్ని రీపిట్ చేసిన మోడీ

పార్లమెంట్‌లో అమిత్ షా ప్రసంగాన్ని రీపిట్ చేసిన మోడీ

అయితే మోడీ ప్రసంగంలో బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానే మోడీ రీపిట్ చేసినట్టుగా ఉంది. ఆర్టికల్ 370 తొలగింపుతో అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న వారే ప్రజాప్రతినిధులకు ఎన్నికవుతాయని తెలిపారు. దీంతో విద్యాఅవకాశాలు కూడ మెరుగుపడతాయని చెప్పారు. ముఖ్యంగా పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందని ఇందులో భాగంగానే బాలివుడ్ సినిమాల షూటింగ్‌కు కూడ అవకాశాలు ఎర్పడతాయయని స్పష్టం చేశారు.

 ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించని మోడీ

ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించని మోడీ

కాని అందరు ఊహించినట్టు కశ్మీర్‌,తోపటు లద్దాక్ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు మాత్రం ప్రకటించలేదు. ప్యాకేజీలతోపాటు పరిశ్రమలపై కూడ దృష్టి సారించలేదు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని, నిరుద్యోగితను పారద్రోలాలంటే ఉపాధి అవకాశలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కాని అందుకు అనుగుణంగా మాత్రం మోడీ ఎలాంటీ హామీలు ప్రకటించలేదు.దీంతో జమ్ము కశ్మీరీల్లో ఎలాంటీ ఉత్సహాం కనిపించలేదు. సాధరణంగా చట్టం మార్పుల ద్వార వచ్చే లాభాలే మోడీ మరోసారి వివరించారని పలువురు విశ్లేషకులు భావించారు.

English summary
The entire country awaited Prime Minister Modi's speech on the consequences of Kashmir. that Modi is going to make a key statement to the local people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X