టోల్‌గేట్‌కు 100 మీటర్ల దూరంలో క్యూలో ఉన్నారా ? నో టోల్ ట్యాక్స్-కేంద్రం ఊరట
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి టోల్ గేట్ల వద్ద ఆటంకాలు తప్పడం లేదు. టోల్‌ట్యాక్స్ బాదుడు సంగతి ఎలా ఉన్నా టోల్ గేట్ల వద్ద వాహనాల క్యూలతో ప్రయాణం అంతకంతకూ ఆలస్యమవుతోంది. దీనికి విరుగుడుగా కేంద్రం ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తెచ్చినా ఫలితం మాత్రం మారలేదు. ఇప్పటికీ అవే క్యూలు దర్శనమిస్తున్నాయి. దీంతో తాజాగా కేంద్రం ఈ క్యూల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే వాహనదారుల కోసం ఓ మినహాయింపును ఇస్తోంది.

టోల్‌గేట్ రూల్స్‌లో మార్పు
దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద రద్దీని నివారించేందుకు కేంద్రం తాజాగా నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటికే రద్దీని తగ్గించేందుకు వీలుగా ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తెచ్చినా ఇంకా రద్దీ తగ్గకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఫాస్టాగ్ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫాస్టాగ్ పేరుతో కేంద్రం చేసిన మార్పులతో రద్దీ తగ్గలేదనే విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో మరోసారి నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

క్యూ 100 మీటర్లు దాటితే నో ట్సాక్స్
ఫాస్టాగ్ అమలవుతున్నప్పటికీ టోల్ గేట్ల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్న నేపథ్యంలో ఇకపై క్యూలో వంద మీటర్లు దాటితే ఆ తర్వాత నుంచి వాహనాలకు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. ఇలా వంద మీటర్లు దాటిన క్యూలో ఉన్న వాహనాలు టోల్ లేకుండా నేరుగా వెళ్లిపోయేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్ధ ఎన్‌హెచ్‌ఐఏ నిబంధనల్లో్ మార్పులు చేసింది. దీంతో వాహనదారులకు భారీ ఊరట లభించనుంది.

వంద మీటర్ల తర్వాత పసుపు గీత
టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించే ప్రక్రియలో భాగంగా వంద మీటర్లు దాటి క్యూలో ఉన్న వాహనాలను టోల్ ట్యాక్స్ లేకుండానే టోల్ గేట్ దాటేందుకు అనుమతించాలని నిర్ణయించిన కేంద్రం..ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వీటి ప్రకారం టోల్ గేట్ నుంచి వంద మీటర్లు దాటిన వెంటనే ఓ పసుపు గీతను గీస్తారు. ఆ పసుపు గీత దాటి ఉన్న వాహనాలు నేరుగా పక్కనే ఉండే ఫ్రీ ఎంట్రీ నుంచి వెళ్లిపోయేందుకు వీలు కల్పిస్తారు. తద్వారా టోల్‌గేట్ల వద్ద రద్దీని భారీగా తగ్గించవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.
Recommended Video

పది సెకన్లలోనే టోల్ గుర్తింపు
ఓ వాహనం టోల్ గేట్ వద్దకు వచ్చినప్పుడు దానికి ఉన్న ఫాస్టాగ్ ఆధారంగా టోల్ గుర్తింపు కోసం పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం పలు చోట్ల నిమిషం, రెండు నిమిషాలు కూడా పడుతున్న నేపథ్యంలో దాన్ని పది సెకన్లకు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో తాజాగా చేసిన మార్పుల ప్రకారం టోల్ గేట్ వద్ద పదిసెకన్లలోనే వాహనానికి ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ను గుర్తించి టోల్ దాటేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications