టెక్కీ మిస్సింగ్: వారమైనా దొరకని ఆచూకీ, ‘ఓఎల్ఎక్స్ ’ కారు కొనుగోలుదారుల పనేనా?

Subscribe to Oneindia Telugu

బెంగళూరు: డిసెంబర్ 18న బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని ఇంటి నుంచి వెళ్లిన పాట్నాకు చెందిన 29ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అనుమానాస్పద స్థితిలో అతను అదృశ్యం కావడం కలకలంగా మారింది.

బ్రిటీష్ టెలీకాం కంపెనీలో పనిచేస్తున్న అజితాభ్ కుమార్ గత సోమవారం సాయంత్రం 6.30గంటలకు తన ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. అప్పట్నుంచి మళ్లీ తిరిగిరాలేదు. ఓఎల్ఎక్స్‌లో తన కారును అమ్మకానికి పెట్టడంతో ఓఎల్ఎక్స్ బయ్యర్ నుంచి అజితాభ్‌కు ఫోన్‌కాల్ వచ్చి ఉంటుందని అతని స్నేహితులు చెబుతున్నారు.

అదృశ్యమైన సోమవారం రాత్రి 7.10కి అజితాభ్ వాట్సప్‌లో యాక్టివ్‌గా ఉన్నాడని తెలిపారు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని, లొకేషన్ మాత్రం వైట్ ఫీల్డ్‌కు సమీపంలోని గుంజురు దగ్గర చూపించిందని చెప్పారు.

No trace of missing Bengaluru techie, left home to meet OLX buyer for car

అజితాభ్ తిరిగి రాకపోవడం, అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటం, కారు ఆచూకీ కూడా ఎక్కడా దొరకపోవడంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు. అతను ఇంటి నుంచి బయల్దేరిన మార్గంలో ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ సేకరించామని పోలీసులు తెలిపారు.

అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, అతను కారు పెట్టిన్ క్లాసిఫైడ్ పోర్టల్‌లో కూడా డేటా సేకరించామని తెలిపారు. అజితాభ్.. 2010 నుంచి తన చిన్న నాటి స్నేహితుడు రవితో కలిసి వైల్డ్ ఫీల్డ్‌లోనే ఉంటున్నాడని పోలీసులు తెలిపారు.

తాజాగా కోల్‌కతా ఐఐఎం(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) ఇంటర్వ్యూ పాసయ్యాడు అజితాభ్. ఈ క్రమంలో ఐఐఎంలో జాయిన్ అయ్యేందుకు తన కారును అమ్మాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 20న రూ.5లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండటంతో అతని కారును అమ్మేందుకు ఓఎల్ఎక్స్‌లో పెట్టాడు. ఈ క్రమంలో గత సోమవారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయల్దేరాడు.

అజితాభ్ తన మారుతి సియాజ్ కారును రూ.12లక్షలకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఆ కారును రూ. 11.8లక్షలకు అమ్మేస్తానంటూ ఓఎల్ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. అంతేగాక, తన ఐఐఎం కోర్సు కోసం ప్రైవేట్ బ్యాంకు లోనుకు కూడా అప్లై చేశాడని అజితాభ్ సోదరుడు అర్నభ్ మీడియాకు తెలిపారు.

కారు కొంటామనే పేరుతో వచ్చిన వారే తన సోదరుడు అజితాభ్‌ను కిడ్నాప్ చేసివుంటారని అర్నభ్ చెప్పారు. ఫ్యామిలీతో గానీ, స్నేహితులతో గానీ ఎలాంటి సమస్యల్లేవని, అలాంటప్పుడు అతను ఎందుకు చెప్పకుండా వెళ్లిపోతాడని అన్నారు. కాగా, అజితాభ్ స్నేహితులు, బంధువులు ఇప్పటికే అతని కోసం ఆన్‌లైన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It’s been a week and there is still no trace of the 29-year-old software engineer from Patna who had gone missing from the Whitefield Area in Bengaluru under mysterious circumstances on December 18.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి