Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందుకు కారణం వారే..నార్త్ ఇండియా లీడర్ల వైఖరిపై పవార్ పంచ్

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ గురించి ప్రస్తావించి.. నార్త్ ఇండియా అని ఫైరయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్‭లో ఉన్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ వద్ద ఆగిపోయిన ఈ బిల్లును ప్రస్తావించారు. ఉత్తర భారతీయుల మనస్తత్వం అందుకు అనుకూలంగా ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడే కాదు తాను కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటి నుంచి బిల్లు ప్రవేశపెడితే మెజారిటీ ఎంపీలు దీనికి మద్దతు ఇవ్వలేదని గుర్తుచేశారు.తిరిగి చూసే సరికి తన పార్టీ ఎంపీలే వెళ్లిపోయారని తెలిపారు.పూణె డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

North India Mentality Sharad Pawar on Women Quota In Parliament

మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రశ్నించారు. పార్లమెంట్, అసెంబ్లీలో ఎందుకు ఈ బిల్లు ఆమోదం పొందలేకపోతోందని అడడగా.. ఆయన ఈ మేరక స్పందించారు. ఈ దేశ మనస్తత్వం సముఖంగా లేకపోవడం వల్లే మహిళా బిల్లు ఆమోదం పొందడం లేదని, మహిళా నాయకత్వాన్ని అంగీకరించేందుకు సముఖంగా లేరని సమాధానం చెప్పారు. ఈ బిల్లుపై పార్లమెంట్, అసెంబ్లీలో తన అనుభవాలను పంచుకున్నారు.

ఉత్తర భారత మనస్తత్వం సముఖంగా ఉండదన్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు లోక్‭సభలో జరిగిన ఒక సన్నివేశాన్ని వివరించారు. మహిళా బిల్లు ప్రవేశ పెట్టానని.. బిల్లుపై ప్రసంగం పూర్తి చేసి వెనక్కి తిరిగి చూసే సరికి సొంత పార్టీ ఎంపీలే లేచి వెళ్లిపోయారు. ఈ బిల్లు ఆ ఎంపీలకే జీర్ణం కాలేదని అర్థమైందన్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన సందర్భాన్ని గుర్తు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టామన్నారు. తొలుత అంతా నో అన్నారు. ఆ తర్వాత అంగీకరించారని శరద్ పవార్ అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+