ఫ్లైట్ నుంచి దూకలేదు కానీ.. అలా బతికిపోయా..! ప్రమాదం నుంచి తప్పించుకున్న ఒకే ఒక్కడు..!
నిన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి 241 మంది చనిపోయినా అదే విమానంలో ప్రయాణించిన 40 ఏళ్ల బ్రిటిష్ ఇండియన్ విశ్వాస్ కుమార్ రాజేష్ మాత్రం బయటపడ్డారు. ఈ అద్భుతం ఎలా జరిగిందో ఆయన స్వయంగా వివరించారు.
నిన్న అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో కేవలం ఒకే ఒక్కరు మినహా మిగిలిన 241 మందీ చనిపోయారు. వీరితో పాటు ఈ విమానం కుప్పకూలిన మెడికల్ హాస్టల్ లో ఉన్న ఎంబీబీఎస్ విద్యార్ధులు 24 మందీ మృత్యువాత పడ్డారు. అయితే ఇంతటి దారుణంలోనూ దేవుడి దయతో బతికిపోయిన ఓ బ్రిటీష్ ఇండియన్ ప్రయాణికుడు తాను ఎలా తప్పించుకుందీ ఇవాళ మీడియాకు వెల్లడించారు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ నిన్న అది కుప్పకూలిన తర్వాత అందులో నుంచి బతికి బయటపడ్డ విశ్వాస్ కుమార్ రాజేష్ ను ఇవాళ ప్రధాని మోడీ అహ్మదాబాద్ లోని ఆస్పత్రిలో పరామర్శించారు. అయితే ప్రధాని పరామర్శ తర్వాత కాస్త కోలుకుంటున్న రాజేష్ నిన్న ఫ్లైట్ లో ఉండగా ఏం జరిగిందో వెల్లడించాడు. విమానం కూలిన సమయంలో ఆయన ఎకానమీ సెక్షన్‌లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరలోని 11ఏ సీటులో కూర్చున్నారు.

తాను బతికి బయటపడ్డానంటేనే నమ్మలేకపోతున్నానని రాజేష్ తెలిపారు. ఒక్క క్షణం తాను కూడా చనిపోతానని అనుకున్నానని గుర్తుచేసుకున్నారు. కానీ కళ్ళు తెరిచి చూసేసరికి తాను బతికున్నట్లు తెలిపారు. ఎలా బతికున్నానో ఇప్పటికీ నమ్మలేకపోతున్నానన్నారు. విమానం టేకాఫ్ అయిన 33 సెకన్ల తర్వాత మెఘాని నగర్ ప్రాంతంలో అది కుప్పకూలిందని ఆయన వెల్లడించారు.
నిన్నటి ఘటనను గుర్తుచేసుకున్న రాజేష్.. ఇవాళ ఆస్పత్రిలో ఇంకా ఆందోళనగా కనిపించారు. విమానం టేకాఫ్ అయిన 5 నుంచి 10 సెకన్లలో గాలిలో చిక్కుకున్నట్లు అనిపించిందని, ఒక్కసారిగా లైట్లు మెరవడం మొదలయ్యాయని ఆయన తెలిపారు. ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో అవి వెలిగాయన్నారు. ఆ తర్వాత విమానం ఏదో ఒక భవనాన్ని ఢీకొట్టిందన్నారు. మిగతా విమానం భవనం పైకప్పుపై కూలిపోగా, తాను ఉన్న విమానం భాగం మాత్రం కిందనే ఉండిపోయిందన్నారు.
తాను బయటకు రావచ్చని అనుకుని ప్రయత్నించానన్నారు. చివరికి బయటకు వచ్చానన్నారు. విమానం మరోవైపు ఉన్నవారు రాలేకపోయారేమో అని తెలిపారు. ప్రమాదం తర్వాత చెలరేగిన మంటల్లో తన ఎడమ చేయి కాలిపోయిందన్నారు. తాను ఎలా బతికున్నానో తనకు తెలియదన్నారు. తన కళ్ల ముందే ఎయిర్ హోస్టెస్‌లు, తన దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులు చనిపోవడం చూశానన్నారు. తాను శిథిలాల నుంచి బయటకు నడిచి వచ్చానన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications