వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మృతి: మరో షాకింగ్ కొత్త కోణం!

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పైన పెద్ద ఎత్తున అనుమానాలు చెలరేగుతున్నాయి. ఆమె మరణం పైన సీబీఐ దర్యాఫ్తు జరపాలని కోరుతూ తెలుగు యువశక్తి సంస్థ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి పైన పెద్ద ఎత్తున అనుమానాలు చెలరేగుతున్నాయి. ఆమె మరణం పైన సీబీఐ దర్యాఫ్తు జరపాలని కోరుతూ తెలుగు యువశక్తి సంస్థ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఓ సీఎంకు ఎలాంటి చికిత్స చేశారో తెలియాలి: స్టాలిన్ఓ సీఎంకు ఎలాంటి చికిత్స చేశారో తెలియాలి: స్టాలిన్

జయలలిత మృతిపై అనుమానాలు కలుగుతున్నాయని, ఆమె మృతి పైన సమగ్ర దర్యాఫ్తు జరపాలని చెన్నైకి చెందిన ఈ స్వచ్చంధ సంస్థ తన పిటిషన్‌లో కోరడం గమనార్హం. జయ మృతిపై అనుమానాలు నివృత్తి అయ్యే వరకు ఆమె సంపద లావాదేవీలను పూర్తిగా నిలిపివేయాలన్నారు.

jayalalithaa

తప్పుడు మందులు?

జయలలిత మృతి పైన పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు వైద్యులు సూచించిన మందులు అందలేదా అనే చర్చ కూడా సాగుతోంది. మరో షాకింగ్ విషయం ఏమంటే.. ఆమె ఆసుపత్రిలో చేరక ముందు తప్పుడు మెడిసిన్స్ అందినట్లుగా తెలుస్తోందనే ప్రచారం సాగుతోంది.

జయ సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో చేరారు. 74 రోజుల పాటు ఆమె చికిత్స పొందారు. ఆ తర్వాత కన్నుమూశారు. అయితే, ఆసుపత్రిలో చేరకముందు ఆమెకు తప్పుడు డయాబెటీస్ మందులు అందినట్లుగా తెలుస్తోందని ప్రచారం సాగుతోంది.

ఎవరికీ భయపడొద్దు!: శశికళను ఎందుకు కలుస్తున్నారు?ఎవరికీ భయపడొద్దు!: శశికళను ఎందుకు కలుస్తున్నారు?

జయ మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని చాలామంది అనుమానిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్కాదత్ పంపిన ఓ ఈ మెయిల్ వెలుగుచూడటం చర్చకు దారి తీస్తోంది. ఆమెను అపోలోకు తీసుకు వచ్చే ముందు డయాబెటిస్ ఔషధాలు కాకుండా వేరే ఔషధాలు ఇచ్చినట్లు యాజమాన్యం చెప్పిందని ఆఫ్ ది రికార్డుగా పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అమ్మ మృతి పైన ప్రముఖ నటి గౌతమి, అన్నాడీఎంకే నుంచి సస్పెన్షన్‌కు గురైన శశికళ పుష్పలు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా, డిఎంకె నేత స్టాలిన్ కూడా గురువారం నాడు అనుమానాలు వ్యక్తం చేశారు.

English summary
Now, DMK leader demands details of Jayalalithaa's treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X