చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటికే ఇంధనం: ఇకపై డీజిల్ కూడా హోమ్ డెలివరీ చేస్తారు...కండీషన్స్ అప్లై

|
Google Oneindia TeluguNews

ఇంటి వద్దకే పెట్రోలు, డీజిల్‌ డెలివరీ ఉంటుందని కొన్ని నెలల క్రితం ప్రముఖ ఆయిల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటికే ఇంధనం కాన్సెప్ట్ భారతదేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ సర్వీసులను తొలుత పూణే నగరంలో ప్రవేశపెట్టింది. అనంతరం ఇతర నగరాలకు కూడా క్రమంగా విస్తరించింది. డోర్ స్టెప్ డెలివరీ ఆఫ ఫ్యూయెల్ పేరుతో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ఇంధనం ఇంటిదగ్గరకే డెలివర్ చేస్తోంది. తాజాగా ఈ సర్వీసును చెన్నై నగరంలో ప్రారంభించింది.

ఇక సాధారణంగా మనము పెట్రోల్ బంకుల్లో చూసే మెషీనే ఈ ట్రక్కులో ఉంది. పెట్రోల్ బంకుల్లో అప్పటికే ట్యాంకుల్లో నిల్వ ఉంచిన ఇంధనంను పంపు ద్వారా ఎలాగైతే మన వాహనంలోకి నింపుతారో అలానే ఈ ట్యాంకర్ నుంచి ఇంధనం తీసుకుని మన వాహనంలోకి నింపుతారు. ప్రస్తుతం డీజిల్‌ను మాత్రమే హోండెలివరీ చేస్తున్నారు. అధికంగా డీజిల్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రయోగానికి తెరతీశారు. దీనివల్ల పెట్రోలు బంకుకు వెళ్లి క్యూలైన్లో నిలబడే బాధ తప్పుతుందని కస్టమర్లు చెబుతున్నారు. ముఖ్యంగా సమయం డబ్బు రెండూ ఆదా అవుతుందని కస్టమర్లు చెబుతున్నారు.

Now Get Fuel at Your Doorstep - Indian Oil Begins Home Delivery of Diesel

ఇక పట్టణ ప్రాంతంలో నివసిస్తూ వాహనాలకు ఇంటిదగ్గరే ఇంధనం పట్టించుకోవడం వారితో పాటు గ్రామీణ ప్రాంత వాసులు కూడా ఇలాంటి కొత్త తరహా కాన్సెప్ట్‌తో లబ్ధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలు బంకులు ఉండవు. వారు పెట్రోలు కోసం కొన్ని మైళ్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఇంధనం డోర్ డెలివరీతో చాలా లబ్ది చేకూరుతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇంధనం డోర్ డెలివరీ కావాలంటే... మొబైల్‌లోని ఓయాప్ ద్వారా ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. అయితే మీ ఆర్డర్ కనీసం 200 లీటర్లు అయి ఉండాలి. ఇక కస్టమర్లు 2,500 లీటర్లు అంతకుమించి ఇంధనం కావాలంటే పీఈఎస్ఓ లైసెన్సు కలిగి ఉండాలి.

పెట్రోలు డీజిల్ కంటే ప్రమాదం కనుక ముందుగా డీజిల్‌ను మాత్రమే సరఫరా చేస్తోంది ఈ మొబైల్ పెట్రోల్ ట్యాంక్. ఈ ట్యాంకులో అగ్నిప్రమాదం సంభవించకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అగ్నిని ఆపేందుకు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లను ఏర్పాటు చేశారు.

English summary
Now Get Fuel at Your Doorstep - Indian Oil Begins Home Delivery of Diesel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X