పేదరికం నాకు చాలా నేర్పింది: మోడీ, యూపీఏ ప్రభుత్వంపై నిప్పులు
అహ్మదాబాద్: దేశ ప్రజలను నల్లధనం వేధిస్తోందని, అవినీతితో ప్రజలు విసిగిపోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం ఆయన ఫిక్కీ 90వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. తొలుత ఫిక్కీకి అభినందనలు తెలిపారు.
1927లో మహాత్మాగాంధీ ఫిక్కీని ఏర్పాటుచేయాలని సైమన్ కమిషన్‌ను కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందన్నారు. తమ హయాములో ద్రవ్యోల్బణం దిగి వచ్చిందన్నారు. స్వచ్ఛ భారత్ కింద దేశంలో ఐదు కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామన్నారు.

తాను ఎంతో పేదరికం అనుభవించానని, దాని నుంచి ఎంతో నేర్చుకున్నానని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో పారదర్శక వ్యవస్థను నిర్మించే దిశగా పని చేస్తామన్నారు. జనధన్ యోజన సామాన్యుడి పాలిట వరంగా మారిందని చెప్పారు.
దేశంలో 9.65 కోట్ల మందికి రుణాలు ఇచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారని, తమ ప్రభుత్వం యువతరంతోనే ఉంటుందన్నారు.
గత యూపీఏ పాలనపై ప్రధాని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుంటుపడిందన్నారు. కోట్ల రూపాయల రుణాలు కేవలం కొద్ది మంది పారిశ్రామికవేత్తలకే కట్టబెట్టారన్నారు. కామన్వెల్త్, 2జీ, బొగ్గు కుంభకోణాలు యూపీఏ ప్రభుత్వ హయాములోనే జరిగాయన్నారు.
బ్యాంకులపై మునుపటి యూపీఏ సర్కారు తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చి కొంతమంది పారిశ్రామికవేత్తలకు రూ.వేల కోట్ల రుణాలు మంజూరు చేయించిందన్నారు. బ్యాంకులపై గత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications