Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జూన్ వరకు రద్దుచేసిన నగదును మార్చుకోవచ్చు

ఎన్ ఆర్ ఐలు పెద్ద నగదు నోట్లను మార్పిడి చేసుకొనేందుకుగాను ఈ ఏడాది జూన్ నాటికి అవకాశం కల్పించింది కేంద్రం.

న్యూఢిల్లీ :రద్దుచేసిన నగదు నోట్లను మార్చుకొనేందుకు ఈ ఏడాది జూన్ 30వ, తేది వరకు ఎన్ ఆర్ ఐలకు కేంద్రం అనుమతినిచ్చింది.అయితే జూన్ తర్వాత ఈ నగదును మార్చుకొనే అవకాశం లేదని కేంద్రం తేల్చేసింది.

గత ఏడాది నవంబర్ 8వ, తేదిన పెద్ద నగదు నోట్లను కేంద్రం రద్దుచేసింది. పెద్ద నగదును రద్దుచేసిన తర్వాత వీటిని మార్చుకొనేందుకుగాను గత ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు గడువు విధించింది. ఈ గడువు పూర్తైంది. రద్దుచేసిన నగదును కలిగివున్నవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

nri's can exchange till june 2017 old currency

అయితే రద్దుచేసిన నగదును కలిగి ఉన్న ఎన్ ఆర్ ఐ లకు మాత్రం కేంద్రం మరో అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ వరకు ఎన్ ఆర్ ఐ లకు అవకాశాన్ని కల్పించింది.

అయితే ఎంత నగదు ఉన్నా ఎన్ ఆర్ ఐలు తమ నగదును మార్చుకొనే వెసులుబాటును కల్పించింది కేంద్రం.ఎన్ ఆర్ ఐ లకు మాత్రం ఫెమా చట్ట నిబంధనల కింద ఒక్కొక్కరు 25 వేల రూపాయాల పరిమితి ఉంటుందన్నారు.

గుర్తింపు పత్రాలతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో విదేశాల్లో ఉన్నట్టు, గతంలో నోట్లు మార్చుకోలేదని ఆధారాలను చూపాలని ఆర్ బి ఐ తేల్చి చెప్పింది. మార్పిడిలో మూడో పక్షాన్ని అనుమతించబోమన్నారు. ఈ నిబంధనలను పూర్తిచేస్తే బ్యాంకు ఖాతాలో మార్పిడి నగదు జమ అవుతోందని ఆర్ బి ఐ ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+