Nurse: అరేబియన్ చికెన్ దెబ్బకు నర్సు బలి, 40 హోటల్స్ సీజ్, ఎక్కడపడితే అక్కడ తింటే ? హుషార్ !

తిరువనంతపురం/కేరళ: ప్రముఖ మెడికల్ కాలేజ్ లో నర్సుగా ఉద్యోగం చేస్తున్న యువతి ఫ్రెండ్స్ తో కలిసి అరేబియన్ చికెన్ డిష్ తినాలని ఓ హెటల్ కు వెళ్లింది. హోటల్ లో ఇష్టంగా ఆర్డరన్ ఇచ్చిన అరేబియన్ చికెన్ తినింది. చికెన్ తిన్న నర్సు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరింది. అయితే చికిత్స విఫలమై ఆ నర్సు చనిపోయింది. అదే హోటల్ లో చికెన్ తిన్న 20 మంది ఆసుపత్రిపాలైనారు. విషపూరిత ఆహారం తినడంవలనే నర్సు చనిపోయిందని ఆరోపిస్తూ ఓ రాజకీయ పార్టీకి చెందిన యువకులు ఆ హోటల్ మీద దాడి చేశారు. నర్సు చనిపోవడంతో అధికారులు నిద్రలేచారు. దెబ్బకు 40 హోటల్స్ సీజ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

మెడికల్ కాలేజ్ నర్సు

మెడికల్ కాలేజ్ నర్సు

కేరళలోని కొట్టాయంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు రేష్మీ రాజ్ అనుమానాస్పదంగా మరణించిన ఒక రోజు తర్వాత కేరళలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు 40 హోటళ్లను మూసివేసి 62 మందికి జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లపై దాడులు చేశామని 28 మందిక ఇప్పిటకే వార్నింగ్ ఇచ్చామని కేరళ ఆహార భద్రత శాఖ అధికారులు స్థానిక మీడియాకు చెప్పారు.

 అరేబియన్ చికెన్ డిష్

అరేబియన్ చికెన్ డిష్

డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికార సీపీఐ(ఎం) యువజన విభాగం సభ్యులు కొట్టాయంలోని హోటల్ పార్క్ పై దాడి చేశారు. అదే హోటల్ లో నర్సు రేష్మీ రాజ్ డిసెంబర్‌లో అరేబియన్ చికెన్ డిష్ అల్ ఫహమ్ ని ఆర్డర్ చేసింది. దానిని తిన్న నర్సు రేష్మీరాజ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరంది. చికిత్స పొందుతున్న నర్సు రేష్మీరాజ్ సోమవారం మృతి చెందింది.

అదే హోటల్ లో తిని ఆసుపత్రిలో 20 మంది

అదే హోటల్ లో తిని ఆసుపత్రిలో 20 మంది


అదే హోటల్‌లో భోజనం చేసిన మరో 20 మంది కొట్టాయంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు హోటల్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసి మూసివేయాలని ఆదేశించారు. పోస్టుమార్టం తర్వాతే రేష్మీరాజ్ ఎలా చనిపోయింది అని పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు అంటున్నారు. కొన్ని విదేశీ వంటకాలతో కలిపిన చెడిపోయిన చికెన్ కలపడం వలనే ఆ ఆహారం విషంగా మారుతుందనేది చాలా సందర్భాలలో నిజం అయ్యిన వియం తెలిసిందే.

 చికెన్ అలా వండితే ఇలాగే అవుతుంది

చికెన్ అలా వండితే ఇలాగే అవుతుంది


కొట్టాయం అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ సీఆర్ రణదీప్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని వండకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ సంఘటన తరువాత కేరళ ఆహార భద్రతా శాఖకు మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కొల్లాం, తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాల్లో అనేక ఫుడ్ జాయింట్‌లపై అధికారులు దాడులు చేశారు. పలు హోటల్స్ సీజ్ చేసిన అధికారులు వాటి లైసెన్స్ రద్దు చేశారు.

 మంత్రి ఆదేశాలు

మంత్రి ఆదేశాలు

కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రవ్యాప్తంగా తినుబండారాలను తనిఖీ చేయాలని, కల్తీ, అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తున్న వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని ఆహార భద్రతా శాఖను ఆదేశించారు. గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల విషజ్వరాలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. నర్సు రేష్మీరాజ్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో కేరళ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక్కసారిగా నిద్రలేచి మెరుపు దాడులు చేస్తున్నారు.

ఫంక్షన్ లో ఫుడ్ తిని 100 మందికి ?

ఫంక్షన్ లో ఫుడ్ తిని 100 మందికి ?

గత వారం కేరళలోని పతనంటిట్టలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆహారం తిన్న 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆ సంఘటనపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్‌లో కోజికోడ్‌లో తినుబండారంలోని ఆహారం తిన్న సుమారు 21 మంది అస్వస్థతకు గురయ్యారని పోలీసులు తెలిపారు. కేరళలో చాలా ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు హోటల్స్ నిర్వహిస్తున్నారు. శుభ్రంగా, నాణ్యతలేని ఆహారం అందివడం వలన చాలా మంది అనారోగ్యానికి గురౌతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+